బ్రహ్మోత్సవాల్లో భారీ వాహనాలకు అనుమతులు లేవు

ABN , First Publish Date - 2023-02-02T01:43:31+05:30 IST

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుంచి నిర్వహించ నున్న నేపథ్యంలో భారీ వాహనాలకు అనుమ తులు లేవని ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.

బ్రహ్మోత్సవాల్లో భారీ వాహనాలకు అనుమతులు లేవు

పెద్దదోర్నాల, ఫిబ్రవరి 1: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుంచి నిర్వహించ నున్న నేపథ్యంలో భారీ వాహనాలకు అనుమ తులు లేవని ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రహ్మోత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి బారీ సంఖ్యలో భక్తులు ప్రయాణిస్తుంటారని ఇలాంటి ప్రశాంత వాతావరణం లో దైవదర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి వెళ్లేందుకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఓపెన్‌టాప్‌ జీప్‌లు, లారీలు, ఆటోలు, మినీ లారీలను నల్లమల్ల ఘాట్‌రోడ్‌లో అనుమతించలేదన్నారు. 17, 18 తేదీలలో కర్నూల్‌ వైపు వెళ్లే భారీ వాహనాలను కుంట జంక్షన్‌ నుంచి గిద్దలూరు వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు. అటవీ, పోలీస్‌శాఖల హెచ్చరికలు అనుసరిస్తూ, డ్రైవర్లు లైసెన్స్‌లు కలిగి ఉండాలని మద్యం సేవించరాదని నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 18వ తేదీ రాత్రి 10గంటల నుంచి 19 తేదీ ఉదయం 4 గంటల వరకు వాహనాలను దోర్నాలలోనే నిలిపివేయనున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-02-02T01:43:34+05:30 IST