శింగరకొండ మరింత అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2023-02-01T23:25:25+05:30 IST

శింగరకొండ మరింత అభివృద్ధికి కృషి చేస్తానని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచై తన్య అన్నారు. శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం వద్ద రూ.1.59 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బుధవారం శం కుస్థాపనలు చేశారు.

శింగరకొండ మరింత అభివృద్ధికి కృషి

రూ.1.59 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కృష్ణచైతన్య

అద్దంకి, జనవరి 1: శింగరకొండ మరింత అభివృద్ధికి కృషి చేస్తానని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచై తన్య అన్నారు. శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం వద్ద రూ.1.59 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బుధవారం శం కుస్థాపనలు చేశారు. రూ.65.50 లక్షలతో మారుతీ భవన్‌ ఆధునికీకర ణ, రూ.45 లక్షలతో డ్రైనేజీ నిర్మాణం, రూ.34 లక్షలతో మాఢవీధులు, రూ.15 లక్షలతో కార్యాలయం భవనం ముందు సీసీ రోడ్డు నిర్మాణ ప నులకు కృష్ణచైతన్య శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ కోట శ్రీనివాసకుమార్‌, ఈవో సుభద్ర, కాకాని రాధాకృష్ణమూర్తి, సందిరెడ్డి రమేష్‌, సర్పంచ్‌ ఎర్రిబోయిన తిరుపత య్య, జమ్మలమడక రమాదేవి హనుమంతరావు, రాఘవరెడ్డి, బాలు, గుంజి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

హుండీల కానుకల లెక్కింపు

శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలోని హుండీల లోని కానుకలను దేవదాయశాఖ పరిశీలకులు శైలేంద్రకుమార్‌, ఈవో సుభద్ర పర్యవేక్షణలో బుధవారం లెక్కించారు. 98 రోజులకు రూ. 36,81,763 నగదు, 44.780 గ్రాముల బంగారం, 304 గ్రాముల వెండి , ఆరు అమెరికా డాలర్లు, 30 కెనడా డాలర్లు, 51 మలేషియా రింగిట్‌లు, 1 కువైట్‌ దినార్‌, 14 వేల ఉగండా చిల్లింగ్‌లు, అర ఒమెన్‌ రియల్‌ వచ్చాయి. చైర్మన్‌ కోట శ్రీనివాసకుమార్‌, డైరెక్టర్‌ జమ్మలమడక రమా దేవి, పూజారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అద్దంకిపై ప్రత్యేక దృష్టి

అద్దంకి, ఫిబ్రవరి1: అద్దంకి పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిం చినట్లు వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. గ డప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం ప ట్టణంలోని 2వ వార్డులో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం నుంచి ఆయా కుటుంబాలకు అందుతున్న లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేం దుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అద్దంకి పట్టణంలోని అన్నిప్రాం తాలలో అంతర్గత రోడ్ల ను సీసీ రోడ్లుగా మార్చటం, సైడ్‌ డ్రైన్‌ల నిర్మా ణం చేపడతామన్నారు. రేణింగవరం రోడ్డును అభివృద్ధిపరిచి సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ ఎస్తేర మ్మ, వైస్‌ చైర్‌పర్సన్‌ కన్నెబోయిన అనంతలక్ష్మి, వైసీపీ పట్టణ అధ్య క్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, సందిరెడ్డి రమేష్‌, కన్నెబోయిన బాల వీరయ్య, కౌన్సిలర్‌లు బాలు, వేజెండ్ల నాగరాజు, సుబ్బరావమ్మ, మేడం రమణ, గుంజి కోటేశ్వరావు, సుధీర్‌, జబ్బార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:25:36+05:30 IST