ఫోన్‌ ట్యాంపింగ్‌లపై సీబీఐ విచారణ చేయాలి

ABN , First Publish Date - 2023-02-02T01:01:15+05:30 IST

రాష్ట్రంలో జరుగుతున్న ఫోన్‌ ట్యాంపింగ్‌లపై సీబీఐ వి చారణ చేయాలని జైభీం భారత్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జడా శ్రావణ్‌కుమార్‌ డిమాండ్‌ చే శారు.

ఫోన్‌ ట్యాంపింగ్‌లపై సీబీఐ విచారణ చేయాలి

జైభీం భారత్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్‌

ఒంగోలు (కలెక్టరేట్‌), ఫిబ్రవరి 1 : రాష్ట్రంలో జరుగుతున్న ఫోన్‌ ట్యాంపింగ్‌లపై సీబీఐ వి చారణ చేయాలని జైభీం భారత్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జడా శ్రావణ్‌కుమార్‌ డిమాండ్‌ చే శారు. బుధవారం ఒంగోలు వచ్చిన ఆయన కలె క్టరేట్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో మాట్లాడారు. 2020లో సీఐడీలో ఉన్న సు నీల్‌కుమార్‌ హైకోర్టు జడ్జిల ఫోన్లను ట్యాపింగ్‌ చేశారని ఆరోపించారు. అలా చేయడం రాజ్యాం గ విరుద్ధమన్నారు. ఈ విషయంపై అప్పటి చీఫ్‌ జస్టిస్‌ మహేశ్వరి ప్రభుత్వంపై సీరియస్‌ అయి న విషయాన్ని శ్రావణ్‌కుమార్‌ గుర్తు చేశారు. ఫోన్లు ట్యాప్‌ చేయడం లేదని చెప్పే ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యేలు చూపించే ఆధారాలపై ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. జగన్‌ ప్ర భుత్వం సొంత ఎమ్మెల్యేలను కూడా నమ్మడం లేదన్నారు. అలాగే జగన్‌ను ప్రజలు, ఉద్యోగుల తోపాటు ఆయన కుటుంబసభ్యులు, ఎమ్మెల్యే లు, మంత్రులు కూడా నమ్మడం లేదని వ్యాఖ్యా నించారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్‌ చేస్తున్నారని శ్రావణ్‌కుమార్‌ ఆరోపిం చారు. ఏపీ రాజధాని విశాఖ అని ఢిల్లీలో కూర్చొ ని జగన్‌ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. మునిగిపోయే పడవలో నుంచి వైసీపీ ఎమ్మెల్యే లు బయటకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడా లని శ్రావణ్‌కుమార్‌ సూచించారు.

Updated Date - 2023-02-02T01:01:19+05:30 IST