ఆటో బోల్తా.. 26 మందికి గాయాలు

ABN , First Publish Date - 2023-02-01T23:30:57+05:30 IST

కూలీ పనులకు వెళ్లి తిరిగి ఇంటికివెళ్ళే క్రమంలో కూలీల తో వెళ్తున్న ఆటో బోల్తాపడి 26 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు మహి ళా కూలీలకు తీవ్రగాయాలయ్యాయి.

ఆటో బోల్తా.. 26 మందికి గాయాలు

అద్దంకి, ఫిబ్రవరి1: కూలీ పనులకు వెళ్లి తిరిగి ఇంటికివెళ్ళే క్రమంలో కూలీల తో వెళ్తున్న ఆటో బోల్తాపడి 26 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు మహి ళా కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. పో లీసుల కథనం మేరకు.. మార్టూరు మం డలం ద్రోణాదులకు చెందిన సుమారు 40 మంది కూలీలు బుధవారం ట్రాలీ ఆ టోలో ప్రకాశం జిల్లా ముండ్లమూరు మం డలం పూరిమెట్లలో మిర్చి కోతలకు వెళ్లా రు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో అద్దంకి పట్టణం సమీపంలోని కలవకూరు రోడ్డులో ఇటుక బట్టీల వద్ద ప్రమాదం చోసుకుంది. ముందువెళ్తున్న మోటార్‌ సైకిల్‌ను దాటి ముం దుకెళ్ళే క్రమంలో అదుపుతప్పి రోడ్డు మార్జిన్‌లో ఉన్న ఇటుక బట్టీలోకి దూసుకుపోయి బోల్తా పడింది. ఆటోలో సుమారు 40 మంది వరకు కూలీలు ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో 26 మంది కూలీలకు గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఇటుక బట్టీ యజమాని, 1వ వార్డు కౌన్సిలర్‌ కొత్తగొర్ల వెంకటసుబ్బారావు(బాలు), ఇటుక బట్టీలో పనిచేసే కూలీలు వెంటనే స్పందించి క్రేన్‌ సహాయంతో బోల్తా పడ్డ ఆటోను పైకి లేపి అందులో ఇరుక్కున్న కూలీలను బయటకు తీయ టంతో ప్రాణాపాయం తప్పింది.

క్షతగాత్రులను అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు 108 వాహనా లలో రెండు సార్లు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో గుంజి వెంకాయమ్మ, వల్లెపు నాగమ్మకు తీవ్ర గాయాలుకావటంతో మె రుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు తరలించారు. అనంతరం వల్లెపు మూర్తమ్మ, కోటగిరి అంజమ్మ, గుంజి పార్వతి, రెంటాల అంజమ్మ, మ ల్లెల అంజమ్మను కూడా ఒంగోలు తరలించారు. మిగిలినవారిని అద్దం కిలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందించారు. సంఘటనాస్థలాన్ని సీఐ రోశయ్య పరిశీలించారు. ప్రమాద విషయమై స్థానికులు, క్షతగా త్రులను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారి గుండా వెళ్తే బొ ల్లాపల్లి వద్ద టోల్‌ గేట్‌ ఉండటంతో ఫీజు చెల్లించాల్సి వస్తుందన్న ఉద్దే శంతో అటువైపు వెళ్లకుండా కలవకూరు, గుర్రంవారిపాలెం, రామకూ రు మీదుగా కోనంకి వెళ్ళే క్రమంలో ప్రమాదం జరిగింది.

Updated Date - 2023-02-01T23:31:03+05:30 IST