ఆపదమిత్రులు బాధ్యతగా పనిచేయాలి

ABN , First Publish Date - 2023-02-06T22:59:08+05:30 IST

విపత్తు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆపదమిత్రులు త మ బాధ్యతలను బాధ్యతా యు తంగా నిర్వహించి బాధిత ప్రాం త ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కాపాడాలని కలె క్టర్‌ దినేష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సో మవారం విపత్తుల నిర్వహణపై శిక్షణ పొందిన వలంటీర్లకు కలెక్టర్‌ కిట్లను అందజేశారు.

ఆపదమిత్రులు బాధ్యతగా పనిచేయాలి

కలెక్టర్‌ దినేష్‌కుమర్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 6 : విపత్తు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆపదమిత్రులు త మ బాధ్యతలను బాధ్యతా యు తంగా నిర్వహించి బాధిత ప్రాం త ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కాపాడాలని కలె క్టర్‌ దినేష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సో మవారం విపత్తుల నిర్వహణపై శిక్షణ పొందిన వలంటీర్లకు కలెక్టర్‌ కిట్లను అందజేశారు. ఒం గోలు, కొత్తపట్నం మండలాల్లో ఎంపిక చేసిన 15 మంది వలంటీర్లకు ఈ కిట్లను అందజేసినట్లు తెలిపారు. గ్రామంలోని యువత ఆ పద సమయంలో తమ వంతు సాయం చేసేందుకు ముందుకు రావాల న్నారు. ఆపదమిత్ర కిట్‌లో లైఫ్‌ జాకెట్‌, ప్ర థమ చికిత్స బాక్స్‌ వంటి 15 ర కాల సామగ్రీని ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ అధికారి జీవీ నారాయణరెడ్డి, జిల్లా పరిషత్‌ సీఈవో జాలిరెడ్డి ఉన్నారు.

దివ్యాంగులకు ఫోన్ల అందజేత

జిల్లాలోని దివ్యాంగులకు 15 టచ్‌ ఫోన్లను కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అంద జేశారు. స్పందన హాలులో సోమవారం జరిగిన కార్యక్రమం లో సాంసంగ్‌ కంపెనికి చెందిన 15 టచ్‌ ఫోన్లను అందజేశారు. రూ.2.25 ల క్షల విలువైన ఫోన్లను దివ్యాంగులకు అందజేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. కా ర్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులు, సహాయ సంస్థ జిల్లా మేనేజర్‌ జీ ఆర్చన పాల్గొన్నారు.

క్రీడారంగంలో విద్యార్థులు రాణించాలి

క్రీడారంగంలో అంతర్జాతీయ స్థాయిలో జిల్లా విద్యార్థులు రాణించాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆకాక్షించారు. కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సో మవారం రాష్ట్ర స్థాయిలో పవర్‌ లిఫ్ట్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ప్రతిభ చూ పిన విద్యార్థులను ఆ యన అభినందించారు. గత నెల 30వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జగ్గయ్యపేటలో జరిగిన పవర్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌లో కేజీబీవీ బిట్రగుంట విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి అండర్‌ 19లో ఓవరాల్‌ టీం చాంపియన్‌ షిప్‌ పవర్‌ లిఫ్టింగ్‌ విన్నర్స్‌, అండర్‌-17 విభాగంలో ఓవ రాల్‌ టీం చాంపియన్‌ షిప్‌ రన్నర్‌, అండర్‌-19 విభా గంలో వెయిట్‌ లిఫ్టింగ్‌ ఓవరాల్‌ టీం చాంపియన్‌షిప్‌లో రన్నర్స్‌గా గెలుపొందారు. దీంతోపాటు జి ల్లాకు 14 బంగారు పతకాలు, నాలుగు వెండి పతకాలు, నాలుగు రజిత పతకాలను సాధించారు. విజేతలైన విద్యార్థులను కలెక్టర్‌ అభినందించారు. కార్యక్రమంలో డీఈవో విజయభాస్కర్‌, ఏపీవో మాధవీలత, స్టెప్‌ సీఈవో బాబూ రావు, జిల్లా క్రీడా సాధికార సంస్థ చీఫ్‌ కోచ్‌ రాజరాజేశ్వరి, పాఠశాల ప్రిన్సిపాల్‌ స్రవంతి, పీఈటీ హెప్సిబా పాల్గొన్నారు.

ఉత్తమ సేవలందించిన వైద్యులకు ప్రశంసాపత్రాలు

జిల్లాలో ఫ్యామిలీ ఫిజీషియన్‌లుగా ఉత్తమ సేవలందించిన ఐదుగురు వైద్యులకు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ప్రశంసాపత్రాలను అందజేశారు. డాక్టర్‌లు జీ కరుణ, నాగరాజలక్ష్మి, హనుమానాయక్‌, డీ హరిబాబు, ఖాదర్‌ మస్తాన్‌భీలను ఈ సంద ర్భంగా స్పందన హాలులో కలెక్టర్‌ ప్రశంసాపత్రాలను అందజేశారు.

సురక్షితంగా ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు బాధ్యతగా వ్యవహరించాలని క లెక్టర్‌ సూచించారు. పీహెచ్‌సీ, విద్యా విధాన్‌ పరిషత్‌ వైద్యాధికారులతో ఆయన జూ మ్‌ సమావేశం నిర్వహించారు. సురక్షిత ప్రసవాలు చేయని వైద్యులపై చర్యలు తప్ప వని హెచ్చరించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి, డీసీహెచ్‌ఎస్‌ మూర్తి, అడిషనల్‌ డీఎంహెచ్‌వో సురేష్‌బాబు, డిప్యూటీ డీఎంహెచ్‌వో మాధవిలత, డీఐఈ పద్మజ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T22:59:10+05:30 IST