ఉద్యోగులంతా ముఖ హాజరు వేయాల్సిందే!

ABN , First Publish Date - 2023-02-07T00:16:00+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులంతా ముఖఆధారిత హాజరు కచ్ఛితంగా వేయాల్సిందేనని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ స్పష్టం చేశారు. దీని ఆధారంగానే జీతభత్యాల చెల్లింపు ఉంటుందని తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం ఆయన డయల్‌ యువర్‌ కలెక్టర్‌, అనంతరం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం మినహాయించినవి తప్ప మిగిలిన శాఖల ఉద్యోగులంతా విధిగా ముఖ హాజరు వేయాలన్నారు.

ఉద్యోగులంతా ముఖ హాజరు వేయాల్సిందే!
స్పందనలో అర్జీలుస్వీకరిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఒంగోలు (కలెక్టరేట్‌), ఫిబ్రవరి 6 : ప్రభుత్వ ఉద్యోగులంతా ముఖఆధారిత హాజరు కచ్ఛితంగా వేయాల్సిందేనని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ స్పష్టం చేశారు. దీని ఆధారంగానే జీతభత్యాల చెల్లింపు ఉంటుందని తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం ఆయన డయల్‌ యువర్‌ కలెక్టర్‌, అనంతరం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం మినహాయించినవి తప్ప మిగిలిన శాఖల ఉద్యోగులంతా విధిగా ముఖ హాజరు వేయాలన్నారు. ఇప్పటి వరకు రిజస్ట్రేషన్‌ చేసుకోని వారంతా రెండు రోజుల్లో చేసుకోవాలన్నారు. లేనిపక్షంలో అందుకు కారణాలను అధికారులు తమకు పంపించాలన్నారు. ఈ విషయమై ప్రత్యేక దృష్టిపెట్టాలని డీఆర్వో, సీపీవోకు సూచించారు. దీనిపై బుధవారం ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. స్పందనకు వచ్చిన అర్జీలను నిర్దేశిత గడువు లోపు పరిష్కరించాలని సూచించారు. అవి రీ ఓపెన్‌ కాకుండా చూడాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో డీఆర్వో చినఓబులేసు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు సరళావందనం, గ్లోరియా, ఉమాదేవి, చెన్నయ్యతోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి కలెక్టర్‌ అర్జీలు స్వీకరించారు.

బోర్లలో నీరు లేక విర్చి పంట ఎండిపోతున్నదని మార్కాపురానికి చెందిన జి.వెంకటరామిరెడ్డి కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ప్రధానమంత్రి ఫసల్‌ భీమా పథకాన్ని అందించి ఆదుకోవాలని ఆయన కోరారు.

తమ భూమిని ఆన్‌లైన్‌ చేయడం లేదని కనిగిరి మండలం పునుగోడుకు చెందిన ఎం.శివయ్య ఫిర్యాదు చేశారు. అనేకసార్లు అధికారులను కలిసి విన్నవించినా పట్టించుకోవడంలేదన్నారు.

తమ పొలానికి వెళ్లే దారిని కొందరు అక్రమించారని తర్లుబాడు మండలం పోతలపాడుకు చెందిన ఆర్‌.బాబు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సర్వే చేయించి దారి కల్పించాలని కోరారు.

Updated Date - 2023-02-07T00:16:02+05:30 IST