అర్హులైన నిర్వాసితులందరికీ పరిహారమివ్వాలి

ABN , First Publish Date - 2023-01-25T01:20:45+05:30 IST

వెలిగొండ ప్రాజెక్ట్‌ ముంపుగ్రామమైన గొట్టిపడియలో అర్హులైన నిర్వాసితులందరికీ పరిహారం అందజేయాలని ఎమ్మెల్యే కుందురు నాగా ర్జునరెడ్డి కోరారు.

అర్హులైన నిర్వాసితులందరికీ పరిహారమివ్వాలి

మార్కాపురం, జనవరి 24: వెలిగొండ ప్రాజెక్ట్‌ ముంపుగ్రామమైన గొట్టిపడియలో అర్హులైన నిర్వాసితులందరికీ పరిహారం అందజేయాలని ఎమ్మెల్యే కుందురు నాగా ర్జునరెడ్డి కోరారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం వెలి గొండ ప్రాజెక్ట్‌ భూసేకరణ విభాగం స్పెషల్‌ కలెక్టర్‌ సరళా వందనం, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఈ ఏడాది చివరికి వెలిగొండకు నీరందించనున్న దృష్ట్యా అధికారులకు నిర్వాసితులకు పునరావాస చర్యలు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో వెలి గొండ ప్రాజెక్ట్‌ కంభం యూనిట్‌ ఎస్‌డీసీ రామ సుబ్బయ్య, నిర్వాసితుల సంఘం ప్రతినిధులు యేల్పుల చెన్నారెడ్డి, నల్లబోతుల కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T01:20:45+05:30 IST