సమాచారం హక్కు చట్టానికి తూట్లు

ABN , First Publish Date - 2023-01-24T23:16:22+05:30 IST

సమాచార హక్కు చట్టానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్‌బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున్‌నాయుడు, నాయకులు భాస్కర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలు డ్వామా పీడీ వెంకట్రావుకి ఫిర్యాదు చేశారు.

సమాచారం హక్కు చట్టానికి తూట్లు
డ్వామా పీడీ వెంకటరావుతోమాట్లాడుతున్న టీడీపీ నాయకులు

పొదలకూరు, జనవరి 24 : సమాచార హక్కు చట్టానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్‌బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున్‌నాయుడు, నాయకులు భాస్కర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలు డ్వామా పీడీ వెంకట్రావుకి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జరిగిన ‘ఉపాధి’ ఫీల్డ్‌ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశానికి హాజరైన డ్వామా పీడీకి సమస్యలను వివరించారు. నావూరుపల్లిలో చెరువు (ఒకే పనిని) పనులను రెండు శాఖల( ఉపాధి హామీ పథకం, ఇరిగేషన్‌) ద్వారా చేశారన్నారు. పొదలకూరు మండలంలో మస్టర్ల ద్వారా రూ.29లక్షలు డ్రా చేశారని, రూ.7.89కోట్లు ఎంబుక్‌ ద్వారా మెటీరియల్‌ ఖర్చు కింద నిధులు ఖర్చు చేశారన్నారు. అధికార పార్టీ నాయకులు, వారి సానుభూతిపరుల పేర్లతో నగదు డ్రా చేశారని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. సర్వే నెంబరు 707, చిట్టేపల్లి తిప్ప వద్ద ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో లెవలింగ్‌ పేర రూ.3కోట్లు, మండలంలోని చాటగొట్ల సర్వే నెంబరు 9లో జరిగిన జగనన్న లే అవుట్ల లెవలింగ్‌ పనుల ద్వారా రూ.70లక్షలు డ్రా చేశారన్నారు. ఆ పనులు, నిధుల వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా కోరితే ఎంపీడీవో, ఏపీవో ఇవ్వకపోగా ఇచ్చిన వెబ్‌సైట్‌ అడ్రస్‌లో వెతికినా ఆ సమాచారం కనిపించలేదని డ్వామా ముందు వాపోయారు. పొదలకూరు పంచాయతీలో అవెన్యూ ప్లాంటేషన్‌లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, గ్రామాల్లో సోషల్‌ ఆడిట్‌ గ్రామసభలు సక్రమంగా నిర్వహించకుండానే మమ అనిపిస్తున్నారని ఫిర్యాదు చేయగా పరిశీలిస్తానని పీడీ సమాధానం ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పులిపాటి వెంకటరత్నంనాయుడు, బక్కయ్యనాయుడు, జమీర్‌, అలుపూరి శ్రీనివాసులు, కృష్ణ కండే, సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.

‘ఉపాధి’కి పూర్తిస్థాయిలో కూలీలు రావాలి

ఫ డ్వామా పీడీ వెంకట్రావు

గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు పూర్తిస్థాయిలో కూలీలు వచ్చేలా చేసి, అందరికీ పని అవకాశాన్ని కల్పించాలని డ్వామా పీడీ వెంకట్రావు అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం పొదలకూరు, చేజర్ల మండలాల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఫీల్ట్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఏపీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదలకూరులో 3500 మంది, చేజర్లలో 2500 మందికి పని చేసుకునే అవకాశం ఉందన్నారు. 8నెలలు నిరంతరంగా పనులు చేయాలన్నారు. అలాగే రూ.257 కూలీని ప్రతి ఒక్కరూ పొందేలాగా చూడాలన్నారు. అలా చేయడం వల్ల మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద రూ.165 కేటాయిస్తారన్నారు. జిల్లాలో సరాసరి కూల్తీ రూ.202 మాత్రమే ఉందన్నారు. ఆదివారం కూడా ఉపాధి పనులు చేసుకునే అవకాశం ఉందని, సద్వినియోగం చేసుకోవాలని

Updated Date - 2023-01-24T23:16:22+05:30 IST