నూరుశాతం పన్నులు వసూలు చేయాలి

ABN , First Publish Date - 2023-02-06T21:21:28+05:30 IST

: పంచాయతీ, సచివాలయ కార్యదర్శులు మార్చి చివరి నాటికి ఇంటి, ఇతరత్రా పన్నులు నూరుశాతం వసూలు చేయాలని కావలి డీఎల్‌పీవో ఆదినారాయణ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని శకునాలపల్లి, పుల్లాయపల్లి గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం సచివాలయాలను తనిఖీ

నూరుశాతం పన్నులు వసూలు చేయాలి
రిజిస్టర్లు పరిశీలిస్తున్న కావలి డీఎల్‌పీవో ఆదినారాయణ

ఉదయగిరి రూరల్‌, ఫిబ్రవరి 6: పంచాయతీ, సచివాలయ కార్యదర్శులు మార్చి చివరి నాటికి ఇంటి, ఇతరత్రా పన్నులు నూరుశాతం వసూలు చేయాలని కావలి డీఎల్‌పీవో ఆదినారాయణ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని శకునాలపల్లి, పుల్లాయపల్లి గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం సచివాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శకునాలపల్లి సచివాలయంలో సిబ్బంది అటెండెన్స్‌, మూమెంట్‌ రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సచివాలయ సేవలను విస్తృతం చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ మల్లికార్జున, సీనియర్‌ అసిస్టెంట్‌ నయీం, పంచాయతీ కార్యదర్శులు కరీముల్లా, తేజ తదితరులు పాల్గొన్నారు.

అక్రమ లేఅవుట్‌లపై చర్యలు చేపట్టాలి

సీతారామపురం : అక్రమ లేఅవుట్‌లపై పంచాయతీ కార్యదర్శులు చర్యలు చేపట్టాలని కావలి డీఎల్పీవో ఆదినారాయణ అన్నారు. ఆయన సోమవారం స్ధానిక ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. నిబంధనల ప్రకారం లేఅవుట్‌ ఫీజు, భూ వినియోగ మార్పిడి, డెవలప్‌మెంట్‌ చార్జీలు, ప్రాసెసింగ్‌ రుసుముతోపాటు, సామాజిక అవసరాలకు 10శాతం ఖాళీస్థలం వదిలి ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌ చేయని వాటిని గుర్తించి బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ భార్గవి పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T21:21:29+05:30 IST