మద్యం దుకాణాల తనిఖీ

ABN , First Publish Date - 2023-02-06T21:19:43+05:30 IST

ఉదయగిరిలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను సోమవారం ఎక్సైజ్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ తనిఖీ చేశారు. ఆంధ్రజ్యోతిలో ఈనె 3న ‘మద్యం దుకాణాల్లో నిబంధనలకు నీళ్లు’ అనే కథనం ప్రచురితం కావడంతో స్పందించిన ఆ

మద్యం దుకాణాల తనిఖీ
దుకాణంలో రికార్డులను పరిశీలిస్తున్న ఎస్‌ఐ శ్రీనివాస్‌

ఉదయగిరి రూరల్‌, ఫిబ్రవరి 6: ఉదయగిరిలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను సోమవారం ఎక్సైజ్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ తనిఖీ చేశారు. ఆంధ్రజ్యోతిలో ఈనె 3న ‘మద్యం దుకాణాల్లో నిబంధనలకు నీళ్లు’ అనే కథనం ప్రచురితం కావడంతో స్పందించిన ఆయన ఈ తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. మద్యం దుకాణాల వద్ద బడ్డీకొట్లు ఏర్పాటు చేసినా, మందుబాబులు సిట్టింగ్‌ వేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దుకాణాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టారు. అనంతరం సంబంధిత రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్‌ మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T21:19:45+05:30 IST