పెంచలకోనలో శ్రీవారికి వైభవంగా కల్యాణం

ABN , First Publish Date - 2023-03-18T22:24:46+05:30 IST

: పెంచలకోనలో లక్ష్మీనృసింహుడికి శనివారం తెల్లవారుజామున అభిషేకాలు, చందనాలంకారసేవ, ఉదయం దేవేరులతో కల్యాణం, సాయంత్రం తిరుచ్చి ఉత్సవం, రాత్రి ఊంజల్‌సేవలను ఆలయ అర్చకులు వైభవంగా ని

పెంచలకోనలో శ్రీవారికి వైభవంగా కల్యాణం
18ఆర్పీఆర్‌6 : కోనలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

రాపూరు, మార్చి 18: పెంచలకోనలో లక్ష్మీనృసింహుడికి శనివారం తెల్లవారుజామున అభిషేకాలు, చందనాలంకారసేవ, ఉదయం దేవేరులతో కల్యాణం, సాయంత్రం తిరుచ్చి ఉత్సవం, రాత్రి ఊంజల్‌సేవలను ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

వేలం ద్వారా భారీ ఆదాయం

పెంచలకోనలో ఏడాదిపాటు (బ్రహ్మోత్సవాలతో కలిపి) హక్కులు పొందేందుకు శనివారం నిర్వహించిన బహిరంగ వేలం పాటల్లో ఆలయానికి భారీగా ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కే. జనార్దన్‌రెడ్డి తెలిపారు. టెంకాయలు, పూజాద్రవ్యాలు అమ్ముకునేందుకు రూ.65,55,000, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కును రూ.34,01,000 దక్కించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఈ రెండు టెండర్ల ద్వారా రూ.17,26,000లు అదనంగా ఆదాయం వచ్చినట్లు తెలిపారు. వేలంలో ఆలయ అధికారులు, అర్చకులు, ఏఎస్‌ఐ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

----------

Updated Date - 2023-03-18T22:24:46+05:30 IST