డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో ఐదుగురు డిబార్‌

ABN , First Publish Date - 2023-01-26T00:22:53+05:30 IST

విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలలో బుధవారం జరిగిన డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో ఐదుగురు విద్యార్థులు డిబార్‌ అయినట్లు యూనివర్సిటీ పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్‌ ఆర్‌.ప్రభాకర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో ఐదుగురు డిబార్‌

నెల్లూరు (సాంస్కృతికం) జనవరి 25 : విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలలో బుధవారం జరిగిన డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో ఐదుగురు విద్యార్థులు డిబార్‌ అయినట్లు యూనివర్సిటీ పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్‌ ఆర్‌.ప్రభాకర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన ఐదో సెమిస్టర్‌ పరీక్షలకు 1,218 మంది విద్యార్థులుగాను 1,100 మంది హాజరుకాగా మిగిలిన 118 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన మూడో సెమిస్టర్‌ పరీక్షల్లో 11,290 మంది విద్యార్థులకుగాను 10,374మంది హాజరుకాగా మిగిలిన 916మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అలాగే ఉదయం జరిగిన పరీక్షల్లో నాయుడుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకరు, సంగంలోని శ్రీ నేతాజి డిగ్రీ కళాశాలలో ఒకరు, మధ్యాహ్నం జరిగిన పరీక్షల్లో నాయుడుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకరు, కోవూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇద్దరు, మొత్తం ఐదుగురు విద్యార్థులు డిబార్‌ అయినట్లు పేర్కొన్నారు.

======

Updated Date - 2023-01-26T00:22:53+05:30 IST