కనిగిరి రిజర్వాయర్‌కు ముప్పు తప్పదు!
ABN , First Publish Date - 2023-01-24T23:23:48+05:30 IST
కనిగిరి కరకట్టల్లో సుమారు 10 నుంచి 30అడుగులకు పైగా లోతుతో గ్రావెల్ తవ్వకాలు చూసి అవాక్కైన మైనింగ్ అసిస్టెంట్ జియాలజిస్టులు రిజర్వాయర్‌కు ముప్పు తప్పదని హెచ్చరించారు. బుచ్చిరెడ్డిపాళెంలోని కనిగిరి రిజర్వాయర్ కరకట్టల్లో జరిగిన గ్రావెల్ తవ్వకాలను మంగళవారం వారు స్థానిక రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్ అఽధికారులతో కలిసి పరిశీలించారు

బుచ్చిరెడ్డిపాళెం, జనవరి 24 : కనిగిరి కరకట్టల్లో సుమారు 10 నుంచి 30అడుగులకు పైగా లోతుతో గ్రావెల్ తవ్వకాలు చూసి అవాక్కైన మైనింగ్ అసిస్టెంట్ జియాలజిస్టులు రిజర్వాయర్‌కు ముప్పు తప్పదని హెచ్చరించారు. బుచ్చిరెడ్డిపాళెంలోని కనిగిరి రిజర్వాయర్ కరకట్టల్లో జరిగిన గ్రావెల్ తవ్వకాలను మంగళవారం వారు స్థానిక రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్ అఽధికారులతో కలిసి పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంత విస్తీర్ణంలో ఎంత మేర గ్రావెల్ తవ్వకాలు చేపట్టారనే విషయంపై సర్వే చేయనున్నట్లు తెలిపారు. రెండు మూడురోజుల్లో సర్వే పూర్తయిన తరువాత అసలు గ్రావెల్ తవ్వకాలకు గతంలో ఇచ్చిన అనమతులు పరిశీలించి నిజనిజాలను తేల్చనున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, మైనింగ్ శాఖల ఉన్నతాధికారులు జాయింట్ తనిఖీ చేపట్టాల్సి ఉందటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి పడిన గండిని రాబట్టేందుకునేందుకు తప్ప ఈ పరిశీలనలు రిజర్వాయర్ కరకట్టలను కాపాడే దిశగా లేవని రైతుల్లో చర్చనీయాంశం. అధికారులు వివరాలు వెల్లడించడంలో గోప్యత పాటించారు.