సైకిళ్లపై దేశాన్ని చుట్టేస్తున్నారు..

ABN , First Publish Date - 2023-01-24T23:21:35+05:30 IST

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇద్దరు యువకులు కొన్ని నెలలుగా సైకిళ్లపై తిరుగుతూ దేశాన్ని చుట్టేస్తున్నారు.

 సైకిళ్లపై దేశాన్ని చుట్టేస్తున్నారు..
సైకిల్‌ యాత్ర చేస్తున్న యువకులు

మనుబోలు, జనవరి 24: ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇద్దరు యువకులు కొన్ని నెలలుగా సైకిళ్లపై తిరుగుతూ దేశాన్ని చుట్టేస్తున్నారు. పంజాబ్‌కు చెందిన ధీరజ్‌ గుప్తా అంటరానితనాన్ని నిర్మూలించి, మత సామరస్యం కాపాడాలంటూ 14నెలలుగా చేస్తున్న సైకిల్‌ యాత్ర మంగళవారం మనుబోలుకు చేరింది. అలాగే పశ్చిమబెంగాల్‌కు చెందిన సుప్రియ దాస్‌ పచ్చదనం- పరిశుభ్రత పేరుతో దేశాన్ని సుందరంగా ఉంచాలంటూ చేస్తున్న సైకిల్‌ యాత్ర మనుబోలుకు చేరింది. ఆ ఇద్దరు యువకులు సైకిళ్లకు వెనుకబాగంలో జాతీయజెండా కట్టుకుని, ముందు బాగంలో సెల్‌పో న్‌లో మార్గం చూసుకుంటూ చెన్నై వైపు ముందుకు సాగారు.

Updated Date - 2023-01-24T23:21:35+05:30 IST