చెన్నకేశవుడికి లక్షతులసి పూజ

ABN , First Publish Date - 2023-02-01T23:01:11+05:30 IST

స్థానిక శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ ఆలయంలో బుధవారం భీష్మఏకాదశి సందర్భంగా సామూహిక లక్షతులసి పూజార్చన నిర్వహించారు. ఆలయంలోని మూలవర్లకు ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోపేతంగా క్షీర, పంచామృతాభిషేకాలను నిర్వహించారు. అనంతరం భక్తు

 చెన్నకేశవుడికి లక్షతులసి పూజ
బుచ్చి : సామూహిక లక్ష తులసి అర్చనలో పాల్గొన్న భక్తులు

మనుబోలు, ఫిబ్రవరి 1: స్థానిక శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ ఆలయంలో బుధవారం భీష్మఏకాదశి సందర్భంగా సామూహిక లక్షతులసి పూజార్చన నిర్వహించారు. ఆలయంలోని మూలవర్లకు ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోపేతంగా క్షీర, పంచామృతాభిషేకాలను నిర్వహించారు. అనంతరం భక్తులతో సామూహికంగా లక్ష తులసి అర్చన చేయించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా పెనుగొండ సుధాకర్‌,శాంతి దంపతులు వ్యవహరించారు.

బుచ్చిరెడ్డిపాళెం : స్థానిక పెద్దూరులోని కోదండరామస్వామి ఆలయంలో బుధవారం భీష్మ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో కొలువైవున్న శ్రీలక్ష్మీనరసింహస్వామికి ఆలయ అర్చకులు సామూహిక లక్ష తులసి అర్చన నిర్వహించారు. ఉదయం స్వామి వారికి పంచామృత అభిషేకం, అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి భక్తులకు ప్రసాదాల వితరణ, తులసిదళాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉభయకర్తలు నందం మాల్యాద్రి లక్ష్మీకాంతమ్మ, అత్తిపల్లి కృష్ణమోహన్‌రెడ్డి,ప్రతిమ, కావలి ఆంజనేయులు, జయమ్మ, ఇప్పగుంట విజయభాస్కర్‌రెడ్డి, సరోజనమ్మ, చెంబేటి పెంచల ప్రసాద్‌,కామేశ్వరమ్మలు తదితరులు పాల్గొన్నారు.

తోటపల్లిగూడూరు : మండలంలోని మహాలక్ష్మీపురంలో గల శ్రీమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో బుధవారం భీష్మ ఏకాదశి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారికి పొంగళ్లు సమర్పించారు. అనంతరం గ్రామోత్సవం జరగ్గా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నైవేద్యాలు సమర్పించారు.

Updated Date - 2023-02-01T23:01:12+05:30 IST