కనిగిరి కరకట్టలను కాపాడాలని బీజేపీ ఆందోళన

ABN , First Publish Date - 2023-01-24T23:27:23+05:30 IST

బుచ్చిరెడ్డిపాళెంలోని కనిగిరి రిజర్వాయర్‌ కరకట్టలను గ్రావె ల్‌ మాఫియా నుంచి కాపాడాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

కనిగిరి కరకట్టలను కాపాడాలని బీజేపీ ఆందోళన
తహసీల్దారు కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు

బుచ్చిరెడ్డిపాళె, జనవరి24: బుచ్చిరెడ్డిపాళెంలోని కనిగిరి రిజర్వాయర్‌ కరకట్టలను గ్రావె ల్‌ మాఫియా నుంచి కాపాడాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం వారు తహసీల్దారు కార్యాలయం వద్ద నిరసన తెలిపి సీనియర్‌ అసిస్టెంట్‌ కొండలరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నమామిగంగే రాష్ట్ర ప్రముఖ్‌ మిడతల రమేష్‌ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం గ్రావెల్‌ అక్రమ తవ్వకాలతో రిజర్వాయర్‌ కరకట్టలను ధ్వంసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ లేఔట్ల పేరుతో ప్రైవేటు లేఔట్లలో రియల్‌ వ్యాపారులకు గ్రావెల్‌ తోలి కోట్లాది రూపాయలకు అమ్ముకుంటున్నారన్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌ చర్యలు చేపట్టి రిజర్వాయర్‌న పరిరక్షించకుంటే పెద్దఎత్తున పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామిశెట్టి మోహన్‌బాబు, కాసా శ్రీనివాసులుతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T23:27:23+05:30 IST