93 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2023-01-24T23:30:39+05:30 IST

వెంకటాచలంలోని స్వర్ణటోల్‌ ప్లాజా వద్ద మంగళవారం పోలీసులు 93 కిలోల గంజాయిని పట్టుకున్నారు.

93 కిలోల గంజాయి పట్టివేత

వెంకటాచలం, జనవరి 24 : వెంకటాచలంలోని స్వర్ణటోల్‌ ప్లాజా వద్ద మంగళవారం పోలీసులు 93 కిలోల గంజాయిని పట్టుకున్నారు. సీఐ గంగాధర్‌రావు, ఎస్‌ఐ అయ్యప్ప పోలీసు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా చెన్నై వైపు వెళ్తున్న రెండు కార్లను తనిఖీ చేయగా 93 కేజీల గంజాయి దొరికింది. గంజాయి తరలిస్తున్న నలుగురిలో ఒకరు తప్పించుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఏపీ39జేహెచ్‌2222 నెంబరు గల కారు డ్రైవర్‌ బిక్కి నరేంద్ర బాబు తప్పించుకోగా, విజయవాడలోని పడమటి లంకకు చెందిన బొమ్మిశెట్టి హరిహారతేజ, బెంగళూరులోని విద్యారాణ్యపురాకు చెందిన కే హరిష్‌, నైజీరియా దేశానికి డోనాటస్‌ లారెన్స్‌లను పట్టుకున్నట్లు తెలిపారు. బిక్కి నరేంద్ర బాబు ద్వారా గంజాయిని విజయవాడ నుంచి బెంగళూరుకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో పట్టుబడిన ముగ్గురు వెల్లడించినట్లు సీఐ గంగాధర్‌ రావు తెలిపారు. ముగ్గురి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2023-01-24T23:30:39+05:30 IST