ముస్తాబైన అలిపిరి మెట్ల మార్గం

ABN , First Publish Date - 2023-02-07T02:56:05+05:30 IST

అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పైకప్పు స్తంభాలు, విద్యుత్‌ దీపాల వెలుగులతో అలిపిరి-తిరుమల కాలినడక మార్గం కనువిందు చేస్తోంది.

ముస్తాబైన అలిపిరి మెట్ల మార్గం

డుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పైకప్పు స్తంభాలు, విద్యుత్‌ దీపాల వెలుగులతో అలిపిరి-తిరుమల కాలినడక మార్గం కనువిందు చేస్తోంది. ప్రత్యేకించి రాత్రి వేళలో నూతన శోభతో భక్తులను ఆకట్టుకుంటోంది. భక్తులు కాలినడక మొక్కు తీర్చుకునేందుకు తిరుపతి నుంచి తిరుమలకు రెండు మార్గాలున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి శ్రీవారిమెట్టు. మరొకటి అలిపిరి మార్గం. 80 శాతం మంది భక్తులు అలిపిరి మార్గాన వెళ్తుంటారు. దాదాపు 40 ఏళ్ల క్రితం నిర్మించిన పైకప్పుతో ఈ మార్గం అస్తవ్యస్తంగా తయారైంది. ఈ నేపథ్యంలో 2019లో రిలయన్స్‌ సంస్థ అందించిన రూ.25 కోట్లతో టీటీడీ మరమ్మతు పనులు ప్రారంభించింది. నూతన పైకప్పు, నేలభాగాలను అభివృద్ధి చేస్తోంది.

-తిరుమల, ఆంధ్రజ్యోతి

Updated Date - 2023-02-07T02:56:06+05:30 IST