Lokesh: పూతలపట్టులో రేపు లోకేష్ పాదయాత్ర

ABN , First Publish Date - 2023-02-04T22:25:59+05:30 IST

చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలో రేపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh) యువగళం పాదయాత్ర సాగనుంది

Lokesh: పూతలపట్టులో రేపు లోకేష్ పాదయాత్ర

చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలో రేపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh) యువగళం పాదయాత్ర సాగనుంది. రేపు ఉదయం 9 గంటలకు తవణంపల్లిలో గాండ్ల సామాజిక వర్గీయులతో లోకేష్ సమావేశం కానున్నారు. ఉదయం 10:30 గంటలకు కురపల్లెలో బీసీలతో నారా లోకేష్‌ మాట్లాడనున్నారు. ఉదయం 11:30 గంటలకు కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో లోకేష్‌ పూజలు చేసిన అనంతరం సాయంత్రం 4:20 గంటలకు కాణిపాకంలో యువతతో నారా లోకేష్‌ సమావేశం కానున్నారు. రాత్రి 7:40 గంటలకు తెల్లగుండ్ల గ్రామస్తులతో లోకేష్‌ సమావేశవుతారు. అనంతరం మంగసముద్రం విడిది కేంద్రంలో నారా లోకేష్ రాత్రి బస చేస్తారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం రోజు 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

లోకేష్ వంద కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకునే లోపే ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి బయటకు వచ్చారని టీడీపీ నేతలు అన్నారు. లోకేష్ పాదయాత్ర పూర్తి అయ్యేనాటికి వైసీపీ (YCP)లో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండరని టీడీపీ నేతలు జోస్యం చెప్పారు. సీఎం జగన్ లోకేష్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని టీడీపీ నేతలు (TDP leaders) స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుందని టీడీపీ నేతలు వెల్లడించారు.

Updated Date - 2023-02-04T22:31:33+05:30 IST