బీమా పథకం అమలుకు చర్యలు

ABN , First Publish Date - 2023-02-01T23:25:09+05:30 IST

వైఎస్సార్‌ పశునష్ట పరిహార పథకం స్థానంలో బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పశుసంవర్ధక శాఖ జేడీ రామచంద్రయ్య తెలిపారు.

   బీమా పథకం అమలుకు చర్యలు

కర్నూలు(అగ్రికల్చర్‌), ఫిబ్రవరి 1: వైఎస్సార్‌ పశునష్ట పరిహార పథకం స్థానంలో బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పశుసంవర్ధక శాఖ జేడీ రామచంద్రయ్య తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ బీమా పథకానికి సంబంధించి మార్గదర్శకాలను జీవో 3 ద్వారా గత నెల జనవరి 12వ తేదీన జారీ చేసిందన్నారు. బీమా కంపెనీలు రైతులకు జరిగిన నష్టానికి సంబంధించి పరిహారాన్ని అందిస్తాయని తెలిపారు. రైతులు ముందుగా పశువులు, గొర్రెలు, మేకలకు సంబంధించి ప్రీమియంను 20 శాతం బీమా కంపెనీకి చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. మిగిలిన 80 శాతం ప్రీమియాన్ని కేంద్రం 40 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరిస్తాయన్నారు. త్వరలోనే బీమా కంపెనీలు ఈ పథకానికి సంబంధించి కాఆర్యాచరణ చేపడతాయని స్పష్టం చేశారు.

Updated Date - 2023-02-01T23:25:10+05:30 IST