రాయలసీమ ద్రోహి సీఎం జగన్‌

ABN , First Publish Date - 2023-02-07T00:14:43+05:30 IST

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాయలసీమ ద్రోహిగా మారారని, ఆయన సీఎంగా ఒక్క రోజు కూడా ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి శ్రద్ధ్ద తీసుకోలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మిగనూరు ఇన్‌చార్జి బీవీ జయనాగేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు.

రాయలసీమ ద్రోహి సీఎం జగన్‌

ఎమ్మిగనూరు టీడీపీ ఇన్‌చార్జి జయనాగేశ్వరరెడ్డి

బాబాయ్‌ హత్య కేసులో నిందితులను పట్టుకోండి

సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కర్నూలు (అగ్రికల్చర్‌), ఫిబ్రవరి 6: ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాయలసీమ ద్రోహిగా మారారని, ఆయన సీఎంగా ఒక్క రోజు కూడా ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి శ్రద్ధ్ద తీసుకోలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మిగనూరు ఇన్‌చార్జి బీవీ జయనాగేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమకు తీవ్ర అన్యాయం చేసిన సీఎంగా జగన్‌ చరిత్రలో మిగిలిపోతారని ఆరోపించారు. సోమవారం కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయలసీమ ప్రాంతంపై ద్రోహ చింతనతో వ్యవహరిస్తున్నారని అన్నారు. నిజాయితీ ఉంటే అప్పర్‌ భద్రపై సాక్షి దినపత్రికలో రాతలపై జగన్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రధానిపై ఒత్తిడి తెచ్చి గుండ్రేవుల ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇప్పించి జాతీయ హోదాను రాబట్టాలని డిమాండ్‌ చేశారు.

బాబాయ్‌ కుటుంబానికి న్యాయం చేయని సీఎం

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను తేల్చడానికి, కేసులు నమోదు చేయడానికి సీఎం జగన్‌ ఎందుకు విఫలమవుతున్నార ని కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం అద్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వ ర్లు ప్రశ్నించారు. బాబాయి కుటుంబానికి న్యాయం చేయలేని సీఎం రాష్ర్టానికి ఏం చేస్తారని అన్నారు. నారా లోకేష్‌ పాదయాత్రలో పోలీసులు అత్యుత్సాహంతో విద్యుత్‌ను నిలిపివేసి, పాదయాత్ర వలంటీర్లపై దాడి చేసి యువగళాన్ని ఆపలేరని అన్నారు.

Updated Date - 2023-02-07T00:14:47+05:30 IST