ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలి

ABN , First Publish Date - 2023-01-26T00:03:46+05:30 IST

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపి ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలని సీపీఐ, ఏఐటీయూసీ తదితర అనుబంధ సంఘాల నాయకులు డిమాండ్‌

 ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలి

సామూహిక దీక్షలో సీపీఐ, ఏఐటీయూసీ డిమాండ్‌

27న విశాఖపట్టణంలో మహాగర్జనను విజయవంతం చేయాలని పిలుపు

కర్నూలు(న్యూసిటీ), జనవరి 25: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపి ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలని సీపీఐ, ఏఐటీయూసీ తదితర అనుబంధ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం శ్రీకృష్ణదేవరాయల కూడలిలలో వందమందితో సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్‌ఎన రసూల్‌, ఎస్‌.మునెప్ప, ఏఐటీయూసీ రాష్ట్ర మాజీ కార్యదర్శి మనోహర్‌, అంగనవాడీల అసోసియేషన నాయకురాలు లలితమ్మ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపద అయిన రైల్వే, విమానయాన, బీఎస్‌ఎనఎల్‌, పోర్టులను ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్లకు విక్రయించాలనుకోవడం దారుణమన్నారు. పరిశ్రమ ప్రభుత్వ రంగంలో ఉండటం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులు సామాజిక రిజర్వేషన్లతో ఉద్యోగా పొందుతున్నారని, ప్రైవేటీకరణ చేస్తే వారికి అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ నెల 27న విశాఖపట్టణంలో జరిగే మహాగర్జన కార్యక్రమంలో ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేష్‌, నగర సహాయ కార్యదర్శులు శ్రీనివాసరావు, జి.చంద్రశేఖర్‌, సీపీఐ నాయకుడు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:03:46+05:30 IST