పది ఉత్తీర్ణత పెంచేందుకు ప్రణాళిక

ABN , First Publish Date - 2023-02-02T00:44:00+05:30 IST

త్వరలో జరగబోయే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో అధిక ఉత్తీర్ణత కోసం ప్రణాళికాబద్ధంగా బోధన సాగాలని ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ అన్నారు.

పది ఉత్తీర్ణత పెంచేందుకు ప్రణాళిక

పాఠశాలలను తనిఖీ చేసిన సబ్‌ కలెక్టర్‌

మంత్రాలయం, ఫిబ్రవరి 1: త్వరలో జరగబోయే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో అధిక ఉత్తీర్ణత కోసం ప్రణాళికాబద్ధంగా బోధన సాగాలని ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ అన్నారు. బుధవారం మండలంలోని చిలకలడోన కస్తూర్బా గాంధీ, మంత్రాలయం ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. గత ఏడాది పదో తరగతిలో ఉత్తీర్ణత పూర్తిగా తగ్గడంపై ఉపాధ్యాయుల బోధనను పరిశీలించారు. గ్రూపులుగా విభజించి వెనుకబడిన విద్యార్థులకు పత్యేక తరగ తులు నిర్వహించాలని సూచించారు. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం తగ్గితే.. ఉపాధ్యా యులదే బాధ్యత అని అన్నారు. అనంతరం కస్తూర్బా పాఠశాలలో తరగతుల గదులు, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం వంటివి తనిఖీ చేశారు. చెట్న హల్లి, సుంకేశ్వరి గ్రామాల్లో పర్యటించి నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ను ఆయన పరి శీలించారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, ఎంపీడీవో ప్రభావతిదేవి, ఎంఈవో మైనుద్దీన్‌, మండల సర్వేయర్‌ వాహీద్‌, ఆర్‌ఐ ఆనంద్‌, సర్వేయర్లు తిమ్మేష్‌, నవీన్‌, ప్రిన్సిపాల్‌ శాంతి, హెచ్‌ఎంలు నాగరాజు, అంపయ్య, రామకృష్ణ వేణి, అనసూయ, సునీత, బందెనవాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T00:44:03+05:30 IST