‘వస్తు నాణ్యతపై రాజీ వద్దు’

ABN , First Publish Date - 2023-01-26T00:58:23+05:30 IST

వస్తువుల నాణ్యతపై రాజీ పడవద్దని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్ట్స్‌ జాయింట్‌ డైరెక్టర్లు సుజాత, రామాకాంత్‌ సాగర్‌ అన్నారు.

‘వస్తు నాణ్యతపై రాజీ వద్దు’

కర్నూలు(కలెక్టరేట్‌), జనవరి 25: వస్తువుల నాణ్యతపై రాజీ పడవద్దని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్ట్స్‌ జాయింట్‌ డైరెక్టర్లు సుజాత, రామాకాంత్‌ సాగర్‌ అన్నారు. బుధవారం కలె క్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాలోలో నాణ్యత ప్రమాణాలపై బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాడర్ట్స్‌ జా యింట్‌ డైరెక్టర్స్‌ సుజాత, రమాకాంత్‌ సాగర్‌, జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి రాజా రఘువీర్‌ అధ్యక్షతన జిల్లా అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ జేడీలు మాట్లాడుతూ ఆజాది కా అమృత్‌ మహోత్సవం కార్యక్ర మంలో భాగంగా కర్నూలు జిల్లా లోని జిల్లా స్థాయి అధికారులందరికీ అవగాహన కార్యక్ర మం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు నిత్యం కొనుగోలు చేసే వస్తువులు, సరుకుల విషయంలో ప్రమాణాలు ఉండాలని, నిర్దేశిత ప్రమాణాలు లేకపోతే తగిన చర్యలు తీసుకో వాలని సూచించారు. వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు వస్తువుపైన ఐఎస్‌ఐ ముద్ర ఉందా? అనేది గమనించాలని, వస్తు తయారీ వివరాలను తెలుసుకోవాలని సూచించారు. పౌరసరఫరాల శాఖ అధికారి రాజా రఘువీర్‌ మాట్లాడుతూ వినియోగదారుడు హక్కులతో పాటు బాధ్యతలు కూడా సంపూర్ణంగా తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువులకు బిల్లు తప్పని సరిగా తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలని, ఏదైనా వస్తువులో లోపం ఉంటే వినియోగదారుల కోర్టుకు ఆశ్రయించి ఫిర్యాదు చేసి న్యాయం పొందాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌, విద్యాశాఖ, శిశుసం క్షేమశాఖ, వైద్యం, ఆరోగ్య శాఖ, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:58:26+05:30 IST