ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం తగదు

ABN , First Publish Date - 2023-02-06T23:24:34+05:30 IST

ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం ఉండకూడదని కలెక్టర్‌ కోటేశ్వరరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్‌ ప్రజల సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు.

   ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం తగదు

నాణ్యమైన పరిష్కారాన్ని ఇవ్వాలి

కలెక్టర్‌ కోటేశ్వరరావు

కర్నూలు(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 6: ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం ఉండకూడదని కలెక్టర్‌ కోటేశ్వరరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్‌ ప్రజల సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండలాల్లో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. అర్జీల స్వీకరణ అనంతరం కలెక్టర్‌ స్పందన అర్జీల పరిష్కారం, ఇతర అంశాలపై జిల్లా అధికారులతో నేరుగాను, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా, మండల స్థాయి అధికారులతోపాటు సచివాలయ సిబ్బంది స్పందన కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఒక్క సమస్య కూడా రీ ఓపెన కాలేదని, అదేవిధంగా సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపి అర్జీలు రీ ఓపెన కాకుండా శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు.

స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు:

ఫ సర్వే నెంబర్‌ 504లో 0.31 సెంట్ల భూమి ఉందని, ఆనలైనలో నమోదు చేసిన ఇతరుల పేరు తొలగించి తమ పేరు నమోదు చేయాలంటూ కర్నూలు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన బాలమ్మ కలెక్టర్‌ కోటేశ్వరరావు వినతిపత్రం సమర్పించారు.

ఫ సర్వే నెం: 512లో 2 ఎకరాల 50 సెంట్ల భూమి ఉందని, ఆనలైనలో 1.50 ఎకరాలు మాత్రమే నమోదైందని, మిగిలిన ఎకరా భూమి ఆనలైనలో నమోదు చేయాలంటూ ఓర్వకల్లు మండలం కొంతలపాడు గ్రామానికి చెందిన నాగమయ్య కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఫ తన భర్త గుండెపోటుతో నవంబరులో మరణించాడని, తనకి ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారని, ఇళ్లు గడవడానికి, పిల్లలను పోషించుకోవడానికి చాలా కష్టంగా మారిన తనకు వితంతువు పెన్షన మంజూరు చేయాలని కోరుతూ గోనెగండ్ల మండలం నెరుడుప్పల గ్రామానికి చెందిన మల్లమ్మ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

Updated Date - 2023-02-06T23:24:35+05:30 IST