ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2023-02-06T23:25:27+05:30 IST

ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్జేడీ ఎస్‌.రవి అన్నారు.

   ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

కడప ఆర్జేడీ ఎస్‌.రవి

కర్నూలు(ఎడ్యుకేషన), ఫిబ్రవరి 6: ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్జేడీ ఎస్‌.రవి అన్నారు. సోమవారం ఆర్‌ఐవో కార్యాలయంలో డీఈసీ మెంబర్స్‌, హైపవర్‌ కమిటీ, డిస్ర్టిక్ట్‌ బల్క్‌ ఇనచార్జి, త్రీమెన కమిటీ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పరీక్ష కేంద్రంలోని ల్యాబ్‌లలో పరీక్ష నిర్వహించే గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. పూర్తి స్థాయిలో ఫర్నీచర్‌, లైటింగ్‌, ఫ్యాన్స, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అధికారులు ప్రతి సెంటరును తనిఖీ చేయాలన్నారు. స్ర్టాంగ్‌ రూమ్‌ను పరిశీలించి, మరికొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, డిస్టిక్ట్‌ బల్క్‌లో కూడా కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆర్‌ఐవో గురువయ్యశెట్టిని ఆదేశించారు. ఇప్పటి వరకు పరిశీలించిన వాటిలో ఏవైనా లోపాలు ఉంటే సరి చేయాలని ఇంటర్‌ బోర్డు అధికారులకు సూచించారు. సమావేశంలో ఆర్‌ఐవో ఎస్‌వీఎస్‌ గురువయ్యశెట్టి, డీవీఈవో జమీర్‌ పాషా, నంద్యాల డీఐఈవో పీవీ రామన, పరమేశ్వరరెడ్డి, శంకర్‌ నాయక్‌, ప్రిన్సిపాల్స్‌ నాగభూషణంరెడ్డి, పద్మావతి, కృష్ణయ్య, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:25:29+05:30 IST