విఘ్నం నుంచి విముక్తి ప్రసాదించు

ABN , First Publish Date - 2023-09-20T00:36:48+05:30 IST

రాష్ట్రానికి జగన్‌ అనే విఘ్నం నుంచి విముక్తి ప్రసాదించాలని టీడీపీ కోడుమూరు ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌ గణపతిని వేడుకున్నారు.

విఘ్నం నుంచి విముక్తి ప్రసాదించు
గూడూరు: వినాయక మండపం వద్ద పూజలు చేస్తున్న ఆకెపోగు ప్రభాకర్‌

టీడీపీ కోడుమూరు ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌

గూడూరు సెప్టెంబరు 19: రాష్ట్రానికి జగన్‌ అనే విఘ్నం నుంచి విముక్తి ప్రసాదించాలని టీడీపీ కోడుమూరు ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌ గణపతిని వేడుకున్నారు. సోమవారం గూడూరు మండలంలో పర్యటించిన ఆయన వినాయక మండపాల దగ్గర చంద్రబాబుకు బెయిల్‌ రావాలని, రాష్ట్రంలో వైసీపీ ఆరాచక పాలన పోవాలని, అన్ని విఘ్నలు తొలగిపోవాలని వినాయ కుడిని వేడుకున్నారు. అక్రమ కేసులు ఏమి చేయలేవని మళ్లీ చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. చంద్రబాబు ప్రజల ఆశీస్సు లతో మళ్లీ అధికారంలోకి వస్తారన్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు ఎల్‌ సుధాకర్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గజేంద్ర గోపాల్‌ నాయు డు, టీడీపీ అధికార ప్రతినిధి దండు సుందరరాజు, మన్నన్‌ బాషా, సులే మాన్‌, తులసీకృష్ణ, మునగాల గోపాల్‌, కళ్యాణ్‌ రఘుబాబు పాల్గొన్నారు.

తప్పు చేయని నాయకుడు చంద్రబాబు

కోడుమూరు: రాజకీయాల్లో తప్పు చేయని నాయకుడు చంద్ర బాబునాయుడు అని టీడీపీ కోడుమూరు ఇన్‌చార్జి ఆకె పోగు ప్రభాకర్‌ అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కోడు మూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి ఆరో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాం లో యువ తలో ఉన్న స్కిల్‌ను బయటికి తీసుకొచ్చి వాళ్లకు ఐటీ రంగంలో ఉద్యోగా లకు దోహద పడిన ఘనత చంద్రబాబునాయుడుకు దక్కుతోంద న్నారు. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ప్రభుత్వ ఖజానాతో స్కిల్‌ డెవ లప్‌మెంటు ద్వారా యువతకు ఉపాధి రంగం అడుగువేయిస్తే వైసీపీ ప్రభుత్వం లేని పోని ఆరోపణలు చేసి అన్యాయంగా చంద్రబాబును అక్రమ అరెస్టు చేసి జైల్లో పెట్టడం యువతను అవమానించినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకుడు అశోక్‌కుమార్‌ రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్ర మంలో అమడగుంట్ల వెంక టేశ్వర్లు, వంశీధర్‌రెడ్డి, ఆదిత్యరెడ్డి, తిరుమలేష్‌, సుందర్‌రాజు, పాండు రంగన్నగౌడ్‌ ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆంధ్రయ్య టీఎన్‌టీయూసీ జిల్లా నాయకుడు కేఈ రఘుబాబుగౌడ్‌ పాల్గొన్నారు.

చంద్రబాబుకు బెయిల్‌ రావాలని పూజలు

కర్నూలు(రూరల్‌): టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు త్వరగా బెయిల్‌ రావాలని పార్టీ నాయకులు పూజలు చేశారు. సోమవారం కర్నూలు నగర శివారులోని మామిదాలపాడు గ్రామంలో 38, 39, 40 వార్డు క్లస్టర్‌ టీడీపీ ఇన్‌చార్జి రామేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మాధవ ఈశ్వర ఆంజనేయస్వామికి 101 టెంకాయలు కొట్టారు. ఈసం దర్భంగా రామేశ్వరరెడ్డి మాట్లాడుతూ కడిగిన ముత్యంవలే చంద్రబాబు బయటకు వస్తారన్నారు. కార్యక్రమంలో యూనిట్‌ ఇన్‌చార్జిలు పాలకవీటి విజయకుమార్‌, ప్రసాద్‌, సురేంద్రగౌడ్‌, శ్రీనివాసులు, పద్మ, గౌసియాబేగం, వేణుగోపాల్‌రెడ్డి, శివారెడ్డి, మాధవకృష్ణారెడ్డి, గంగాధర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-20T00:36:48+05:30 IST