ఘనంగా మాజీ గవర్నర్ పెండేకంటి జయంతి
ABN, First Publish Date - 2023-06-18T23:20:35+05:30
బనగానపల్లె పట్టణంలో కర్ణాటక, బీహార్ మాజీ గవర్నర్, శ్రీ హనుమంతరాయ ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు పెండేకంటి వెంకటసుబ్బయ్య 102వ జయంతిని ఆయన కుమారుడు పెండేకంటి బాలాజీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహిం చారు.
బనగానపల్లె, జూన్ 18: బనగానపల్లె పట్టణంలో కర్ణాటక, బీహార్ మాజీ గవర్నర్, శ్రీ హనుమంతరాయ ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు పెండేకంటి వెంకటసుబ్బయ్య 102వ జయంతిని ఆయన కుమారుడు పెండేకంటి బాలాజీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహిం చారు. వృద్ధాశ్రమంలోని వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు. ఆస్పత్రి ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ సైంటిస్టు ధనలక్ష్మి, కేవీకే శాస్త్రవేత్తలు రమణయ్య, బాలరాజు, కృష్ణమూర్తి, సుధాకర్, లక్ష్మీప్రియ, సొసైటీ అడ్మినిస్ట్రేషన్ అధికారి సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. అలాగే బనగానపల్లె వాసవి పాలిటెక్నిక్ కళాశాలలో పెండేకంటి జయంతి సందర్భంగా ప్రిన్సిపాల్ రమణ రెడ్డి ఆధ్వర్యంలో పెండేకంటి వెంకటసుబ్బయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన విద్యాభివృదిఽ్ధకి అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-06-18T23:20:35+05:30 IST