నేరాల నియంత్రణకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2023-02-01T23:24:10+05:30 IST

అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నేరాల నియంత్రణకు కృషి చేయాలని ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ అన్నారు.

   నేరాల నియంత్రణకు కృషి చేయాలి

ఎస్పీ సిద్దార్థ కౌశల్‌

కర్నూలు, ఫిబ్రవరి 1: అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నేరాల నియంత్రణకు కృషి చేయాలని ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో ఆయన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేర రహిత సమాజంగా తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్షపడే విధంగా పోలీసు అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. శిక్షల శాతం పెంచి బాధితులకు న్యాయం జరిగేలా చేయాలని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయినప్పటి నుంచి కేసు పూర్తయ్యే వరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్షుల విచారణ, వాంగ్మూలం కోర్టుకు సమర్పించడంలో కోర్టు, పోలీసు అధికారులు పనితీరులో వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని అన్నారు. నేరస్థులకు వారెంట్స్‌, సమన్స, సత్వరమే ఎగ్జిక్యూటివ్‌ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరస్థులకు కోర్టులో కఠిన శిక్షలు పడితే.. బాధితులకు న్యాయవ్యవస్థ పోలీసు శాఖపై నమ్మకం, గౌరవం పెరుగుతుందన్నారు. కోర్టులో కేసులు వీగిపోకుండా శ్రద్ధ తీసుకోవాలని, బలమైన వాదనలు వినిపించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. ప్రతి కేసులో కచ్చితమైన దర్యాప్తు (క్వాలిటీ ఇన్వెస్టిగేషన) ఉండాలన్నారు. గ్రేవ్‌, నాన గ్రేవ్‌ కేసుల్లో సాక్షులను మోటివేట్‌ చేయాలన్నారు. సెన్సేషనల్‌ కేసుల్లో త్వరగా పరిశోధన పూర్తి చేసి చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని చెప్పారు. పెండింగ్‌ ట్రయల్‌ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. గ్రామ సందర్శనలు, పల్లెనిద్రలు, ఫ్యాక్షన, లా అండ్‌ ఆర్డర్‌ ఇతర సమస్యలను నివారించడానికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యల గురించి గుర్తించబడిన గ్రామాల్లో సీసీ కెమెరాల సంస్థాపన, పురోగతిపై ఆరా తీశారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని సబ్‌ డివిజనలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న యుఐ కేసులు, గ్రేవ్‌ కేసుల గురించి ఆయన సమీక్షించారు. సమావేశంలో అడిషినల్‌ ఎస్పీ అడ్మిన డి.ప్రసాద్‌, లీగల్‌ అడ్వైజర్‌ మల్లికార్జునరావు, డీఎస్పీలు వెంకటాద్రి, వెంకట్రామయ్య, యుగంధర్‌బాబు, శ్రీనివాసులు, వినోద్‌ కుమార్‌, కేవీ మహేష్‌, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:24:11+05:30 IST