వైభవంగా చౌడేశ్వరీదేవి రథోత్సవం

ABN , First Publish Date - 2023-02-06T23:27:06+05:30 IST

కోడుమూరు చౌడేశ్వరీదేవి రథోత్సవ వేడుకలు సోమవారం అశేష జనవాహిని మధ్య వైభవంగా సాగాయి.

   వైభవంగా చౌడేశ్వరీదేవి రథోత్సవం
అమ్మవారి రథోత్సవము

కోడుమూరు, పిబ్రవరి 6: కోడుమూరు చౌడేశ్వరీదేవి రథోత్సవ వేడుకలు సోమవారం అశేష జనవాహిని మధ్య వైభవంగా సాగాయి. రథోత్సవ వేడుకలు సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి వంటి కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పెద్దఎత్తున పూజలు నిర్వహించారు. పూజా అనంతరం ఉత్సవ విగ్రహాన్ని రథంపై నిలిపారు. అటగార దేవాంగ దైవాచార సంఘం ఆధ్వర్యంలో భక్తుల నడుమ అమ్మవారి రథోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు కదిలి వచ్చారు. దీంతో పట్టణ పురవీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేడుకల అనంతరం భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి చేరుకోవడంతో కిటకిటలాడింది. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.

Updated Date - 2023-02-06T23:27:07+05:30 IST