బండలాగుడు పోటీలు ప్రారంభం

ABN , First Publish Date - 2023-02-07T00:27:52+05:30 IST

చౌడేశ్వరీదేవి జాతరను పురస్కరించుకొని జడ్పీ హైస్కూల్‌ మైదానంలో భూమాత రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం బండలాగులు పోటీలు ప్రారంభమయ్యాయి.

బండలాగుడు పోటీలు ప్రారంభం

కోడుమూరు, పిబ్రవరి 6: చౌడేశ్వరీదేవి జాతరను పురస్కరించుకొని జడ్పీ హైస్కూల్‌ మైదానంలో భూమాత రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం బండలాగులు పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ముందుగా పాతబస్టాండ్‌ నుంచి మైదానం వరకు ఊరేగింపు చేపట్టారు. ఇం దులో భాగంగా ప్రత్యేక కోలాటలు, చెక్కభజన, శ్రీకాకులం నుంచి వచ్చిన గిరిజన గోండు జాతి డిన్సా నృత్యం వంటి కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకొన్నాయి. ఇందులో టీడీపీ నాయకులు సర్పంచు భాగ్యరత్న, మాజీ సర్పంచు సీబీ లత, కేఈ రాంబాబు, హేమాద్రిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కేఈ మల్లికార్జునగౌడ్‌లు కోలాటలు, ఆటలతో ప్రజలను ఆకర్షించారు. జడ్పీ మైదానం చేరుకొన్న అనం తరం టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, కేంద్ర మాజీమంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, యువనేత కోట్ల రాఘవేంద్రరెడ్డి, కోట్ల కౌశిక్‌రెడ్డి, కోట్ల కవితమ్మలు బండలాగుడు పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌, పట్టణ అధ్యక్షుడు ఎల్లప్పనాయుడు, తిరుమల్‌నాయుడు, గోపాల్‌ నాయుడు పాల్గొన్నారు.

ముగిసిన సబ్‌ జూనియర్‌ బండలాగుడు పోటీలు: చౌడేశ్వరీదేవి జాతర సందర్భంగా సోమవారం నిర్వహించిన సబ్‌ జూనియర్‌ విభాగం రాష్ట్ర స్థాయి బండలాడుగు పోటీలు ముగి శాయి. ఈ పోటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి 16 జతల కాడీలు వచ్చాయి. పాణ్యం మండలం ఎస్‌. కొత్తూరు గ్రామానికి చెందిన భీరం సుబ్రహ్మ ణ్యేశ్వరరెడ్డి ఎద్దుల జతలు నిర్ణయించిన 15 నిమిషాలల్లో 5400 అడుగుల వరకు బండను లాగి మొదటి స్థానాన్ని కైవసం చేసుకొన్నాయి. నంద్యాల జిల్లాకు చెందిన మనోహర్‌ యాదవ్‌, వెల్దుర్ది మండలానికి చెందిన బజారిల ఎద్దులు రెండో స్థానం నిలిచాయి. తెలం గాణకు చెందిన రామచంద్రారెడ్డి, నంద్యాల జిల్లాకు చెందిన ఆర్‌కే రెడ్డి అనూషరాణిలకు చెందిన ఎద్దులు మూడో స్థానం, గోనెగండ్ల మండలం పెద్దనెలటూరు గ్రామం సుంకన్న ఎద్దులు నాలుగో స్థానం, గూడూరు మండలం మునగాల గ్రామానికి చెందిన మహాదే వమ్మ, అంజనమ్మల ఎద్దులు ఐదో స్థానంలో నిలిచాయి. మంగళవారం సీనియర్‌ విభాగం ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం సభ్యు లు మధుసూధన్‌రెడ్డి, హేమాద్రిరెడ్డి తెలిపారు.

Updated Date - 2023-02-07T00:27:56+05:30 IST