నీరు లేని కాల్వబుగ్గ

ABN , First Publish Date - 2023-02-02T00:54:15+05:30 IST

మండల పరిధిలోని కాల్వబుగ్గ రామే శ్వరస్వామి క్షేత్రంలో నీటిఎద్దడి నెలకొంది.

నీరు లేని కాల్వబుగ్గ
చిన్న కోనేరులో బోరు నీరు

బోర్ల నీటితో కింద కోనేరులోకి నీటి సరఫరా

ఇబ్బందులు పడుతున్న భక్తులు

ఓర్వకల్లు, ఫిబ్రవరి 1: మండల పరిధిలోని కాల్వబుగ్గ రామే శ్వరస్వామి క్షేత్రంలో నీటిఎద్దడి నెలకొంది. చిన్న కోనేరు, పెద్దకోనేరు లను బోరు నీటితో నింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్న కోనేటి సమీపంలో రెండు బోర్లు వేసినా వాటిలో కూడా అంతంత మాత్రమే నీరు వస్తోంది. ఒకప్పుడు కాల్వబుగ్గకు పుష్కలమైన నీటి వనరులు ఉండేవి. హుశేనాపురం, కాల్వ గ్రామాలకు చెందిన 300 ఎకరాలకు నీరందేది. ప్రస్తుతం నీరు లేకపోవడంతో ఆ పొలాలు బీడుగా మారాయి. పెద్ద కోనేటిలో చుక్కనీరు కూడా లేదు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు నీటి కష్టాలను తీర్చేందుకు ప్రత్నామ్నాయ చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

ఇంకిపోయిన నీటి బుడగలు

కాల్వబుగ్గ క్షేత్రంలో నీటి బుడగలు ఎండి పోయాయి. గతంలో నీటితో కళకళలాడే కోనేరులలో నీరు లేక వెలవెలబోతున్నాయి. నీటి బుడగలు 300 ఎకరాలకు నీరు అందించేది. ప్రస్తుతం ఆరేళ్ల నుంచి నీరు కరువైంది.

- నాగరాజు, భక్తుడు

పూర్వ జ్ఞాపకాలు కరువే

గత ఐదేళ్లుగా పూర్వపు జ్ఞాపకాలు కరువవ య్యా యి. గతంలో హుశేనా పురం నుంచి కాలినడకన వెళ్లి కోనేటిలలో స్నానాల చరించేవారం. రానురాను కాల్వబుగ్గలో నీరు కరువైది. వీటితోపాటు భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

- సుధాకర్‌, కాల్వబుగ్గ మాజీ చైర్మన్‌, హుశేనాపురం

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం

ప్రస్తుతం కాల్వబుగ్గలో భూగ ర్భ జలాలు ఇంకిపోవడంతో చిన్న కోనేటికి బోరు ద్వారా నీటిని సర ఫరా చేస్తున్నాం. అలాగే పెద్ద కోనేరు కూడా నీరు లేక ఎండిపోయింది. ప్రత్యామ్నాయంగా అక్కడే ఉన్న బోరుకు మోటారు బిగించి నీటిని వదులుతాం. వాగు వెంట ఉన్న పాచి నీ త్వరలోనే తొలగిస్తాం. శివరాత్రి భక్తు లకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.

- డీఆర్‌కేవీ ప్రసాద్‌, ఆలయ ఈవో

Updated Date - 2023-02-02T00:54:21+05:30 IST