పోలీసు స్పందనకు 101 ఫిర్యాదులు

ABN , First Publish Date - 2023-02-07T00:32:57+05:30 IST

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు.

పోలీసు స్పందనకు 101 ఫిర్యాదులు
బాధితుల సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ

కర్నూలు, ఫిబ్రవరి 6: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం జరిగిన స్పం దన కార్యక్రమానికి 101 ఫిర్యాదులు వచ్చాయి. తమ షాపుకు అడ్డంగా రేకులు, రాడ్లు పాతిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మాధవరం గ్రామానికి చెందిన ఈడిగ సుజాత ఫిర్యాదు చేశారు. తన భర్త హింసిస్తున్నాడని అమడగుంట్లకు చెందిన నాగేశ్వరమ్మ ఫిర్యాదు చేశారు. మోసపూరితంగా ప్లాట్‌ను తప్పుడు రిజిస్ర్టేషన్‌ చేసి తమపై దాడి చేసే ప్రయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు స్వామిరెడ్డినగర్‌కు చెందిన లత ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలో ఒక వ్యక్తి రస్తాకు అడ్డంగా రాళ్లు వేయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కర్నూలు మండలం, ఈ-తాండ్రపాడు గ్రామానికి చెందిన ఆరుగురు ఫిర్యాదు చేశారు. ఎండోమెంట్‌ డిపార్టుమెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక వ్యక్తి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని మోసం చేశాడని కర్నూలు బాలాజీనగర్‌కు చెందిన అయ్యన్న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి పరిష్కరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ స్సందన కార్యక్రమంలో సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ కృష ్ణకాంత్‌ పటేల్‌, అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ డి.ప్రసాద్‌, డీఎస్పీ నాగభూషణం, లీగల్‌ అడ్వైజర్‌ మల్లికార్జునరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:33:00+05:30 IST