తెలంగాణకు ఇసుక రవాణా

ABN , First Publish Date - 2023-02-07T01:23:04+05:30 IST

కొద్ది రోజులుగా తెలంగాణకు లారీల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతుండడంతో ఆదివారం రాత్రి టీడీపీ నందిగామ మండల ప్రధాన కార్యదర్శి తోట నాగమల్లేశ్వరరావు (బుజ్జి), తెలుగు యువత జగ్గయ్యపేట నియోజకవర్గ కార్యదర్శి కొత్తపల్లి బ్రహ్మం, గుర్రం చందు, పలు గ్రామాల నాయకులతో కలిసి తెలంగాణ-ఆంధ్రా సరిహ ద్దులో జొన్నలగడ్డ బోర్డర్‌ చెక్‌పోస్ట్‌ బోర్డర్‌ వద్ద ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీని నిలిపారు.

తెలంగాణకు ఇసుక రవాణా
జొన్నలగడ్డ బోర్డర్‌ చెక్‌పోస్టు వద్ద పట్టుకున్న ఇసుక లారీ

లారీని పట్టుకున్న టీడీపీ నేతలు

నందిగామ రూరల్‌, ఫిబ్రవరీ 6: కొద్ది రోజులుగా తెలంగాణకు లారీల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతుండడంతో ఆదివారం రాత్రి టీడీపీ నందిగామ మండల ప్రధాన కార్యదర్శి తోట నాగమల్లేశ్వరరావు (బుజ్జి), తెలుగు యువత జగ్గయ్యపేట నియోజకవర్గ కార్యదర్శి కొత్తపల్లి బ్రహ్మం, గుర్రం చందు, పలు గ్రామాల నాయకులతో కలిసి తెలంగాణ-ఆంధ్రా సరిహ ద్దులో జొన్నలగడ్డ బోర్డర్‌ చెక్‌పోస్ట్‌ బోర్డర్‌ వద్ద ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీని నిలిపారు. 100 నంబర్‌కు ఫోన్‌ చేస్తే వారు 14500 నంబర్‌ ఇచ్చారని టీడీపీ నేతలు తెలిపారు. 14500కు ఫోన్‌ చేస్తే వారు కంప్లైంట్‌ నంబర్‌ ఎన్టీఆర్‌ 202302067 ఇచ్చి పదిహేను రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. ముందుగా నంది గామ ఆర్డీవో, తహసీల్దార్‌, స్పెషల్‌ ఎస్సై, సీఐకు ఫోన్‌ చేసిన ఎత్త లేదని ఫోన్‌ ఎత్తినా పలువురు అధికారులు తమ పరిధిలోది కాదని అన్నారని చెప్పారు. విజయవాడకు చెందిన జయప్రకాష్‌ సంస్థ పేరుతో వే-బిల్లు తీసుకుని నందిగామ మండలం రుద్రవరం ప్రభుత్వ ఇసుక రీచ్‌తో పాటు మాగల్లు మునేరు, కూడలి వైరా మునేటి నుంచి నిత్యం ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిం చారు. ఇసుక ర్యాంపులో లారీకి 35 టన్నులకు గాను రూ.14,700 లారీ కిరాయి 10,000 మొత్తం 27,000 ఆంధ్రా బోర్డర్‌లో దింపే విధంగా వే బిల్లులో నమోదు చేశారని పేర్కొ న్నారు. తెలంగాణలో లారీని రూ.75 వేల నుంచి లక్షకు ఇసుకకు డిమాండ్‌ ఉందని అక్కడ అమ్ముకుంటున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. అధికారు చర్యలు తీసు కోకుంటే ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా బోర్డర్‌ చెక్‌పోస్ట్‌ వద్ద ఏటిపట్టు గ్రామా ల నాయకులంతా ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తామని తెలిపారు.

Updated Date - 2023-02-07T01:23:05+05:30 IST