ఓటు పౌరుడి చేతిలో వజ్రాయుధం

ABN , First Publish Date - 2023-01-26T00:39:27+05:30 IST

ఓటు హక్కు వినియోగం ప్రతి పౌరుడి బాధ్యత అని, దానిని ప్రతి ఒక్కరూ వినియోగిం చుకోవాలని ఆర్డీవో రవీంద్రరరావు కోరారు.

 ఓటు పౌరుడి చేతిలో వజ్రాయుధం
నందిగామలో ప్రమాణం చేయిస్తున్న ఆర్డీవో రవీంద్రరావు

నందిగామ, జనవరి 25: ఓటు హక్కు వినియోగం ప్రతి పౌరుడి బాధ్యత అని, దానిని ప్రతి ఒక్కరూ వినియోగిం చుకోవాలని ఆర్డీవో రవీంద్రరరావు కోరారు. 13వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఆర్డీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ ఓటర్లను సత్కరిం చారు. విద్యార్థులకు ఓటు హక్కుపై వ్యాసరచన పోటీలు, ఓటుపై అవగాహన కల్పించే ముగ్గులు వేయించారు. విజేత లకు బహుమతులు అందజేశారు. ఆర్డీవో ఎన్నికల సమ యంలో ఓటును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు వేయడం పట్ల నిర్లక్ష్యంగా ఉండడమంటే దేశం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నట్లేనన్నారు. రాజ్యాంగం అందించిన ఇంతటి మహోన్నత మైన ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. అనంతరం ఓటు హక్కు వినియోగంపై ప్రమాణం చేయిం చారు. కార్యక్రమంలో సీఐ సతీష్‌, తదితరులు పాల్గొన్నారు.

నందిగామ రూరల్‌: మండలంలో బుధవారం అడవిరావులపాడు, రామిరెడ్డిపల్లి, మాగల్లు గ్రామాల్లో సీనియర్‌ సిటిజన్స్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు. నాయకులు కొమ్మినేని రవిశంకర్‌, ఆకుల రంగా పాల్గొన్నారు.

జగ్గయ్యపేట : పట్టణంలో అమ్మాణి కళాశాలలో విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించి, ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కర్లపాటి శ్రీనివాసరావు, వాసవీ క్లబ్‌ ప్రతినిధి కర్లపాటి కొండలు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:39:27+05:30 IST