యువగళానికి తోడుగా బీసీ దళం

ABN , First Publish Date - 2023-01-25T01:10:37+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టనున్న యువగళం పాదయాత్రకు తోడుగా బీసీ దళం ఉంటుందని రాష్ట్ర బీసీ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి తెలిపారు.

యువగళానికి తోడుగా బీసీ దళం

వన్‌టౌన్‌, జనవరి 24 : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టనున్న యువగళం పాదయాత్రకు తోడుగా బీసీ దళం ఉంటుందని రాష్ట్ర బీసీ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి తెలిపారు. మంగళవారం ఆటోనగర్‌లోని జిల్లా టీడీపీ కా ర్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ లోకేష్‌ 400 రోజుల పాటు 4వేల కి లోమీటర్లు చేస్తున్న పాదయాత్రకు విజయవంతం కా వాలని కోరుతూ బుధవారం మధ్యాహ్నం 3గంటలకు రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడు కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి దుర్గగుడి వర కు పాదయాత్రగా వెళ్లి దుర్గమ్మకు 400 టెంకాయలు కొట్టి, చీర సారె సమర్పిస్తామన్నారు. పాదయాత్రలో రాష్ట్ర నేతలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు పాల్గొంటారన్నారు. కావున పార్టీ నేతలు, అన్ని బీసీ విభాగాలకు సంబంధించిన నేతలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర బీసీ గౌడ సాధికారిక కార్యదర్శి బొల్లా వెంకటేశ్వరరావు గౌడ్‌, జిల్లా బీసీ సెల్‌ కార్యదర్శి ఆర్‌. యల్లబాబు, ఉమ్మడి జిల్లాల బీసీ గౌడ సాధికారిక క న్వీనర్‌ పి.కిషోర్‌ బాబు, శివరాం గౌడ్‌ పాల్గొన్నారు.

మోకాళ్లపై మెట్లెక్కిన సాయికల్యాణి

రాష్ట్రం బాగుకోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టనున్న యువగళం పాదయా త్ర విజయవంతం కావాలని మంగళవారం తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కల్యాణి మోకాళ్లపై దుర్గగుడి మెట్లు ఎక్కారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం ఎన్ని అడ్డంగులు సృష్టించిన లోకేష్‌ పాదయాత్ర విజయవంతంగా పూర్తవ్వాలని కోరుకుంటూ మోకాళ్లపై ఇంద్రకీలాద్రి మెట్లు ఎక్కి మెట్ల పూజ చేసినట్టు గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గం మహిళ అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, అంగన్‌వాడీ వి భాగం రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్‌ బొప్పన నీరజ, సెంట్రల్‌ మహిళ అధ్యక్షురాలు ఉదయశ్రీ, పార్టీ నేత లు శ్రీకాంత్‌ పలువురు మహిళ నేతలు పాల్గొన్నారు.

లోకేష్‌ పాదయాత్ర విజయవంతం కావాలి...

విద్యాధరపురం : యువగళం పేరుతో టీడీపీ జా తీయ కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం కావాలని మహిళాలోకం కోరుకుంటోందని తెలుగు మహిళ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షురాలు చె న్నుపాటి ఉషారాణి అన్నారు. మొగల్రాజపురంలోని కే శినేని శివనాథ్‌ (చిన్ని) కార్యాలయంలో ఆమె పార్టీ అ నుబంధ సంఘాలైన తెలుగు మహిళ టీఎన్‌టీయూసీ, టీఎన్‌ఎ్‌సఎఫ్‌, లా విభాగాల నేతలతో కలిసి విలేకరు ల సమావేశం మాట్లాడారు. టీఎన్‌టీయూసీ రాష్ట్ర కా ర్య నిర్వాహక కార్యదర్శి పాల మాధవ్‌ మాట్లాడుతూ లోకేష్‌ పాదయాత్ర కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. టీఎన్‌ఎ్‌సఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.చర ణ్‌ సాయి యాదవ్‌, ఐటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా దుర్గారావు, పలువురు మహిళలు పాల్గొన్నారు.

యువత భవిష్యత్‌ కోసమే పాదయాత్ర

రాణిగారితోట : రాష్ట్రంలో యువత భవిష్యత్‌ కోసం నారా లోకేష్‌ పాదయాత్ర చేపడుతున్నారని, మద్దతుగా రాష్ట్ర బీసీ సెల్‌ కమిటీ ఆధ్వర్యంలో కొల్లు రవీం ద్ర నేతృత్వంలో జరిగే బీసీ యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర పరిశీలకుడు సుఖవాసి శ్రీనివాస్‌ అ న్నారు. రాణిగారితోట 17వ డివిజన్‌ టీడీపీ కార్యాలయంలో మంగళవారం తూర్పు నియోజకవర్గ బీసీ సె ల్‌ అధ్యక్షులు కొక్కెరి తిరుపతయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ బీసీ విభాగం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలకు టీ డీపీ పెద్దపీట వేసిందని, టీడీపీ అంటేనే బీసీల పార్టీ అన్నారు. బీసీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేరేపీ ఈశ్వర్‌, పార్టీ బీసీ విభాగం నేతలు డివిజన్‌లోని నాగేంద్ర స్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. వేముల దుర్గారావు, ఇస్త్రం డానియేలు, పోలిపల్లి ముని, మధు, గంగాధర్‌, యల్లబాబు, పీరుబాబు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T01:10:37+05:30 IST