బాలికల సంరక్షణ మనందరి బాధ్యత

ABN , First Publish Date - 2023-01-25T00:36:43+05:30 IST

జాతీయ బాలికాదినోత్సవాన్ని పట్టణం, మండలంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ హైస్కూల్‌, సిద్ధార్థ, సర్వోదయ స్కూల్‌ విద్యార్థులు చేపట్టిన ర్యాలీనీ డాక్టర్‌ కొడాలి సుజాత ప్రారంభించారు.

బాలికల సంరక్షణ మనందరి బాధ్యత
తిరువూరులో అవగాహన ర్యాలీ

తిరువూరు, జనవరి 24: జాతీయ బాలికాదినోత్సవాన్ని పట్టణం, మండలంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ హైస్కూల్‌, సిద్ధార్థ, సర్వోదయ స్కూల్‌ విద్యార్థులు చేపట్టిన ర్యాలీనీ డాక్టర్‌ కొడాలి సుజాత ప్రారంభించారు. వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

గంపలగూడెంలో..

జాతీయ బాలికా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. లిటిల్‌ ఏంజిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విశ్రాంత ఎంఈవో వి.శేషిరెడ్డి, ప్రిన్సిపాల్‌ ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

చందర్లపాడులో..

ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో చందర్లపాడు జిల్లా పరిషత్‌ పాఠశాలలో పిల్లలకు మంగళవారం పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.

ఇబ్రహీంపట్నంలో..

బాలికలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న అన్నారు. జన విజ్ఞాన వేదిక కొండపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో బాలికా మేలుకో-చట్టాలు తెలుసుకో అంశంపై హెచ్‌ఎం సంతోష్‌కుమార్‌ అధ్యక్షతన మంగళవారం సభ నిర్వహించారు. ఎదిగే ఆడపిల్ల ఏం తెలుసుకోవాలి అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేవీవీ ఉపాధ్యక్షులు పి.కామేశ్వరరావు, ఎస్‌.కె.సర్దార్‌ సాహెబ్‌, ఎస్‌.డి.మస్తాన్‌ వలీ, డి.ఇందిరాదేవి, జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. క్రాంతి కాన్వెంట్‌ పుట్టనిద్దాం.. బతకనిద్దాం.. ఎదగనిద్దాం అనే నినాదంతో తయారుచేసిన బోర్డులను ఆవిష్కరించారు. మురళీమోహన్‌, సీతారామారావు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:36:43+05:30 IST