దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

ABN , First Publish Date - 2023-01-25T00:46:35+05:30 IST

శివారు ప్రాంతాల్లో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని బయోలజిస్టు సూర్యకుమార్‌ సంబంధిత అధికారులకు సూచించారు.

దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

బయోలజిస్టు సూర్యకుమార్‌

అజిత్‌సింగ్‌నగర్‌, జనవరి 24 : శివారు ప్రాంతాల్లో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని బయోలజిస్టు సూర్యకుమార్‌ సంబంధిత అధికారులకు సూచించారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని మలేరియా సర్కిల్‌-3 కార్యాలయంలో మంగళవారం ఆయన సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివారు ప్రాంతాలైన అజిత్‌సింగ్‌నగర్‌, వాంబేకాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట, ప్రకాష్‌నగర్‌, సుందరయ్యనగర్‌, రాజీవ్‌నగర్‌, ఉడాకాలనీ తదితర ప్రాంతాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్ర ఫాగింగ్‌ చేయాలన్నారు. మలేరియా విభాగ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:46:35+05:30 IST