కొండప్రాంతంలో పారిశుధ్య విధానాన్ని మెరుగుపరచాలి

ABN , First Publish Date - 2023-01-26T00:44:00+05:30 IST

నగరంలోని కొండ ప్రాంతంలో నిర్వహిస్తున్న పారిశుధ్య విధానాన్ని మెరుగుపరిచి, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అధికారులను ఆదేశించారు.

కొండప్రాంతంలో పారిశుధ్య విధానాన్ని మెరుగుపరచాలి

కొండప్రాంతంలో పారిశుధ్య విధానాన్ని మెరుగుపరచాలి

చిట్టినగర్‌, జనవరి 25 : నగరంలోని కొండ ప్రాంతంలో నిర్వహిస్తున్న పారిశుధ్య విధానాన్ని మెరుగుపరిచి, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అధికారులను ఆదేశించారు. నగర పర్యటనలో భాగంగా బుధవారం 44, 51 డివిజన్లలోని నాలుగు స్తంభాల సెంటర్‌, వాగు సెంటర్‌, నెహ్రూ బొమ్మ సెంటర్‌లోని పలువీధులు, కొండప్రాంతాలను పర్యవేక్షించి పారిశుధ్య పనితీరును పరిశీలించారు. కొండ ప్రాంత వాసుల సమస్యలను కమిషనర్‌ ఆరా తీశారు. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణ విధానం మెరుగుపరచాలని, మెట్లమార్గంలో ఉన్న పైపులైన్‌లను కాంక్రీట్‌తో మూసివేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. కొత్తపేటలోని కేటీ రోడ్డులో పూర్తయిన సీసీ రోడ్డును పరిశీలించి, నెహ్రూబొమ్మ సెంటర్‌ నుంచి చిట్టినగర్‌ జంక్షన్‌ వరకు మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కార్పొరేటర్‌ మరుపిళ్ల రాజేష్‌, జోనల్‌ కమిషనర్‌-1 కేటీ సుధాకర్‌, హెల్త్‌ ఆఫీసర్లు డాక్టర్‌ సురేష్‌ బాబు, ఈఈ నారాయణ మూర్తి పాల్గొన్నారు.

ఫ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ఏర్పాట్లను బుధవారం ఉదయం నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ఇతర ప్రముఖ అధికారులు విచ్చేయుచున్న సందర్భంలో ఏర్పాట్ల పురోగతిని కమిషనర్‌ పరిశీలించారు.

Updated Date - 2023-01-26T00:44:00+05:30 IST