జయహో.. ‘వారాహి’

ABN , First Publish Date - 2023-01-26T00:35:42+05:30 IST

జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథం వారాహి ప్రయాణం విజయవాడలో బుధవారం మొదలైంది. రాష్ట్రంలో తొలిసారిగా వారాహి వాహనంపై నుంచి పవన్‌ కల్యాణ్‌ రోడ్‌షో నిర్వహించారు. వాహనానికి ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డు వద్ద ఉన్న కామధేను అమ్మవారి ఆలయం వద్ద పూజలు చేశారు. తొలుత ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం పవన్‌ ఇక్కడ వాహనానికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంతో ఘాట్‌రోడ్డులో రాకపోకలను కొంతసేపు ఆపేశారు. ఇంద్రకీలాద్రి నుంచి ఘాట్‌రోడ్డు వరకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వారాహి వాహనాన్ని తిలకించడానికి ఉదయం నుంచి అభిమానులు, కార్యకర్తలు హైదరాబాద్‌ జాతీయ రహదారిపై గూమిగూడారు. దీంతో కనకదుర్గ ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. వారాహికి పూజల కారణంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ఘాట్‌రోడ్డు వద్ద జనసందోహం కనిపించింది. ఘాట్‌రోడ్డు మీదుగా అమ్మవారి దర్శనానికి వెళ్లే వారిని కనకదుర్గ నగర్‌ వైపు నుంచి పంపించారు.

జయహో.. ‘వారాహి’

ఇంద్రకీలాద్రి నుంచి ఎన్నికల ప్రచార రథంపై జనసేనాని ర్యాలీ

భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు

వారధి వద్ద ర్యాలీలో వాహనాలను అడ్డుకున్న పోలీసులు

విజయవాడ, జనవరి 25(ఆంధ్రజ్యోతి)

జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథం వారాహి ప్రయాణం విజయవాడలో బుధవారం మొదలైంది. రాష్ట్రంలో తొలిసారిగా వారాహి వాహనంపై నుంచి పవన్‌ కల్యాణ్‌ రోడ్‌షో నిర్వహించారు. వాహనానికి ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డు వద్ద ఉన్న కామధేను అమ్మవారి ఆలయం వద్ద పూజలు చేశారు. తొలుత ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం పవన్‌ ఇక్కడ వాహనానికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంతో ఘాట్‌రోడ్డులో రాకపోకలను కొంతసేపు ఆపేశారు. ఇంద్రకీలాద్రి నుంచి ఘాట్‌రోడ్డు వరకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వారాహి వాహనాన్ని తిలకించడానికి ఉదయం నుంచి అభిమానులు, కార్యకర్తలు హైదరాబాద్‌ జాతీయ రహదారిపై గూమిగూడారు. దీంతో కనకదుర్గ ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. వారాహికి పూజల కారణంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ఘాట్‌రోడ్డు వద్ద జనసందోహం కనిపించింది. ఘాట్‌రోడ్డు మీదుగా అమ్మవారి దర్శనానికి వెళ్లే వారిని కనకదుర్గ నగర్‌ వైపు నుంచి పంపించారు.

ఫ ఘాట్‌ నుంచి కదిలిన వారాహి

కామధేను అమ్మవారికి పూజలు చేసిన తర్వాత వారాహి వాహనంపైకి ఎక్కి పవన్‌కల్యాణ్‌ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం వాహనం ముందుకు కదిలింది. భారీ ర్యాలీ మధ్య ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. మోడల్‌ గెస్ట్‌హౌస్‌ వద్ద పార్టీ పశ్చిమ నియోజకవర్గ నేతలు గజమాలను వారాహి వాహనానికి వేశారు. మరికొంత దూరం వచ్చిన తర్వాత గదను పవన్‌కు అందజేశారు. కనకదుర్గ వారధి వరకు ర్యాలీగా చేరుకున్నారు. వారాహి వాహనంతోపాటు దాని వెంట ఉన్న కాన్వాయ్‌ను మాత్రమే పోలీసులు ముందుకు అనుమతించారు.

ఫ అంబులెన్స్‌లకు మార్గమిచ్చి...

రోగులతో వెళ్తున్న అంబులెన్స్‌లకు దారి ఇవ్వడానికి పవన్‌కల్యాణ్‌ రెండుసార్లు ర్యాలీని నిలుపుదల చేశారు. సీతమ్మవారి పాదాల వద్ద ఉండవల్లి నుంచి 108 అంబులెన్స్‌ రావడంతో ర్యాలీని ఆపేసి మార్గమిచ్చారు. వారధి వద్దకు ర్యాలీ వస్తుండగా కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ వద్ద మరో అంబులెన్స్‌ వచ్చింది. దీనికి మార్గం ఇవ్వడం కోసం ర్యాలీని నిలుపుదల చేశారు.

Updated Date - 2023-01-26T00:35:44+05:30 IST