చంద్రబాబుతోనే ప్రవాసాంధ్రులు : రవీంద్ర

ABN , First Publish Date - 2023-01-26T00:49:38+05:30 IST

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకే ఉందని, ప్రవాసాంధ్రులు సైతం చంద్రబాబు పాలననే కోరుకుంటున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు.

 చంద్రబాబుతోనే  ప్రవాసాంధ్రులు : రవీంద్ర

మచిలీపట్నం టౌన్‌ : రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకే ఉందని, ప్రవాసాంధ్రులు సైతం చంద్రబాబు పాలననే కోరుకుంటున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో చికాగో ఎన్‌ఆర్‌ఐ సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌ పెద మల్లు దంపతులను ఆయన సత్కరించారు. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎన్‌ఆర్‌ఐలు ఆకాంక్షిస్తున్నారన్నారు. తెలుగు ప్రజలు చంద్రబాబుకు అం డగా నిలవాలన్నారు. మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబా ప్రసాద్‌, మచిలీపట్నం నగర అధ్యక్షుడు ఎండి ఇలియాస్‌ పాషా, సీనియర్‌ నాయకుడు గనిపిశెట్టి గోపాల్‌, కొక్కిలిడ్డ రమేష్‌, రామధాని వేణు, శ్రీకాంత్‌, దుర్గారావు, అంజి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:49:38+05:30 IST