Devothoti Nagaraju: లోకేష్ పాదయాత్ర ఓట్ల కోసం కాదు..

ABN , First Publish Date - 2023-02-07T12:23:16+05:30 IST

నారా లోకేష్ (Nara Lokesh) యువగళం (Yuvagalam) పాదయాత్ర (Padayatra).. జగన్ రెడ్డి పాదయాత్ర మాదిరిగా ఓట్ల వేట కోసం సాగుతున్నది కాదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు.

Devothoti Nagaraju: లోకేష్ పాదయాత్ర ఓట్ల కోసం కాదు..

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం (Yuvagalam) పాదయాత్ర (Padayatra).. జగన్ రెడ్డి (Jagan Reddy) పాదయాత్ర మాదిరిగా ఓట్ల వేట కోసం సాగుతున్నది కాదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు (Devothoti Nagaraju) అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అరాచక వైసీపీ పాలన (YCP Govt.)లో నష్టపోయిన ప్రతి వర్గానికి భవిష్యత్తుపై భరోసా కల్పించడానికి సాగుతున్న యాత్ర అని అన్నారు. యువగళం పాదయాత్రను విమర్శిస్తున్న వైసీపీ నాయకులు.. లోకేష్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. 27 దళిత సంక్షేమ పథకాలు ఎందుకు రద్దు చేశారో.. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఎందుకు దారి మల్లుతున్నాయో.. వైసీపీ నేతలు సమాధానం చెప్పి వారి నిబద్దత చాటుకోవాలని దేవతోటి నాగరాజు అన్నారు.

11వ రోజు 9.2 కి.మీ. నడక

‘టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడి చేసినప్పుడు అక్కడకు వచ్చి ఫొటోలు తీస్తున్న నాయక్‌ అనే సీఐని మా కార్యకర్తలు ప్రశ్నించారు. దీంతో నాపైన, ఎమ్మెల్సీ అశోక్‌బాబుపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు. ఇలా జగన్‌రెడ్డి రాజ్యంలో నేను కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితుడినే’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ వ్యాఖ్యానించారు. చిత్తూరులో సోమవారం జరిగిన యువగళం 11వ రోజు పాదయాత్రలో ఆయన 9.2 కిలోమీటర్లు నడిచారు. దళితులు, బీమా మిత్రలు, బీడీ కార్మికులు, న్యాయవాదులు, విద్యుత్‌ ఉద్యోగులు, మహిళలు ఆయన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నారు. దళితులతో జరిగిన సమావేశంలో లోకేశ్‌ మాట్లాడుతూ.. పులివెందులలో ఎస్సీ మహిళ నాగమ్మను అత్యాచారం చేసి హత్యచేస్తే ఇంతవరకు ప్రభుత్వం ఆ కుటుంబానికి న్యాయం చేయలేదన్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన టీడీపీ నేతలు ఎంఎస్‌ రాజు, వంగలపూడి అనితపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని ఆక్షేపించారు. అమరావతిలోనూ దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి.. సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్లారని గుర్తుచేశారు. దళితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టిన ఘన చరిత్ర జగన్‌దేనని ఎద్దేవాచేశారు. ఎస్సీల సంక్షేమానికి ఎవరెంత ఖర్చు చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. మాల, మాదిగ కార్పొరేషన్లు పెట్టి ఎంత నిధులు ఖర్చుచేశారో మంత్రి మేరుగ నాగార్జున సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్‌ను చంపి మృతదేహాన్ని ఆయన ఇంట్లో అప్పగించిన ఘటనను ప్రస్తావిస్తూ.. జగన్‌ సీఎం అయ్యాక దళితులను చంపి శవాలను డోర్‌ డెలివరీ చేయడానికి వైసీపీ వాళ్లకు లైసెన్సులు ఇచ్చారని మండిపడ్డారు. ‘చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణస్వామికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. జగన్‌రెడ్డి, పెద్దిరెడ్డి కూర్చున్నచోట ఆయన కూర్చోవడానికి కుర్చీ కూడా ఉండదు. అదీ వైసీపీ ప్రభుత్వం దళితులకిచ్చే గౌరవం’అని వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-02-07T12:23:19+05:30 IST