పోల్‌ ఎక్కిన అభిమానం

ABN , First Publish Date - 2023-01-26T01:25:25+05:30 IST

వారాహి వాహనానికి కనక దుర్గమ్మ సన్నిధిలో బుధవారం పూజలు చేశాక వాహనంపై యాత్రగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వెళుతుండగా ఆయనను చూసేందుకు భారీగా అభిమానులు తరలిరావడంతో వారధి కూడలి కిక్కెరిసింది.

పోల్‌ ఎక్కిన అభిమానం
స్తంభాలపై నుంచి పవన్‌ కల్యాణ్‌ను చూస్తున్న అభిమానులు

రాణిగారితోట, జనవరి 25: వారాహి వాహనానికి కనక దుర్గమ్మ సన్నిధిలో బుధవారం పూజలు చేశాక వాహనంపై యాత్రగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వెళుతుండగా ఆయనను చూసేందుకు భారీగా అభిమానులు తరలిరావడంతో వారధి కూడలి కిక్కెరిసింది. పవన్‌ దృష్టిలో పడేందుకు ఇద్దరు అభిమానులు కూడలి సర్కిల్‌ వద్ద ఉన్న పార్క్‌లో విద్యుత్‌ స్తంభాలు ఎక్కారు. వీరిని చూసిన పవన్‌ కల్యాణ్‌ జాగ్రత్త అని హెచ్చరించి, దిగమని సైగలు చేశారు. వారధి సర్కిల్‌ వద్దకు వచ్చిన వారాహి వాహనానికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2023-01-26T01:25:25+05:30 IST