ఫేస్‌ ఆధారిత మస్తర్‌ విధానాన్ని ఎత్తివేయాలి

ABN , First Publish Date - 2023-02-02T00:55:01+05:30 IST

నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మున్సిపల్‌ ఉద్యోగ కార్మికులకు ఏపీఎఫ్‌ఆర్‌ఎస్‌ మస్తర్‌ విధానాన్ని ఎత్తివేయాలని, 15 నిమిషాలు పొడిగించాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ వర్క్‌ర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) నగర గౌరవ అధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్‌ డిమాండ్‌ చేశారు.

ఫేస్‌ ఆధారిత మస్తర్‌ విధానాన్ని ఎత్తివేయాలి

ఫేస్‌ ఆధారిత మస్తర్‌ విధానాన్ని ఎత్తివేయాలి

చిట్టినగర్‌, ఫిబ్రవరి 1: నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మున్సిపల్‌ ఉద్యోగ కార్మికులకు ఏపీఎఫ్‌ఆర్‌ఎస్‌ మస్తర్‌ విధానాన్ని ఎత్తివేయాలని, 15 నిమిషాలు పొడిగించాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ వర్క్‌ర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) నగర గౌరవ అధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్‌ డిమాండ్‌ చేశారు. కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాశీనాథ్‌ మాట్లాడుతూ గ్రేస్‌ పిరియడ్‌ 15 నిమిషాలు ఇవ్వడంతో పాటు, ఎఫ్‌ఆర్‌ఎస్‌ సిస్టం ఎత్తివేసి పాతపద్ధతిన కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం నగర కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. నాయకులు ఎస్‌. జ్యోటిబస్‌, టి. ప్రవీణ్‌, ధనికొండ వెంకటేశ్వరరావు, పి.మహేష్‌ బాబు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T00:55:03+05:30 IST