లక్ష్మీపురం సర్పంచ్‌కి షోకాజ్‌

ABN , First Publish Date - 2023-01-25T00:27:15+05:30 IST

చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం విషయంలో గ్రామ సర్పంచ్‌ కొల్లూరి కోటేశ్వరరావుకు జిల్లా పంచాయతీ అధికారి ఎస్‌వి.నాగేశ్వర నాయక్‌ మంగళవారం షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. నిధుల దుర్వినియోగం జరిగిన నేపథ్యంలో చెక్‌పవర్‌ ఎందుకు రద్దు చేయకూడదో పది రోజుల్లో రాతపూర్వకంగా సంజాయిషీ ఇవ్వాలనీ, లేకుంటే చెక్‌పవర్‌ అధికారాన్ని పూర్తిగా తొలగిస్తామనీ స్పష్టం చేశారు. ఈ మేరకు డీపీవో జారీ చేసిన షోకాజ్‌ నోటీసును చల్లపల్లి ఈవోపీఆర్డీ బూరేపల్లి అశోక్‌కుమార్‌ లక్ష్మీపురం సర్పంచ్‌కి అందజేశారు.

లక్ష్మీపురం సర్పంచ్‌కి షోకాజ్‌

చెక్‌పవర్‌ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని డీపీవో నోటీసు

రూ.38 లక్షల మేర నిధుల దుర్వినియోగం

చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం విషయంలో గ్రామ సర్పంచ్‌ కొల్లూరి కోటేశ్వరరావుకు జిల్లా పంచాయతీ అధికారి ఎస్‌వి.నాగేశ్వర నాయక్‌ మంగళవారం షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. నిధుల దుర్వినియోగం జరిగిన నేపథ్యంలో చెక్‌పవర్‌ ఎందుకు రద్దు చేయకూడదో పది రోజుల్లో రాతపూర్వకంగా సంజాయిషీ ఇవ్వాలనీ, లేకుంటే చెక్‌పవర్‌ అధికారాన్ని పూర్తిగా తొలగిస్తామనీ స్పష్టం చేశారు. ఈ మేరకు డీపీవో జారీ చేసిన షోకాజ్‌ నోటీసును చల్లపల్లి ఈవోపీఆర్డీ బూరేపల్లి అశోక్‌కుమార్‌ లక్ష్మీపురం సర్పంచ్‌కి అందజేశారు.

చల్లపల్లి, జనవరి 24 : గ్రామ పంచాయతీ సాధారణ నిధులు రూ.6లక్షల 64వేల 247... 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.32 లక్షల 8వేల 600 మొత్తంగా రూ.38 లక్షల పైచిలుకు దుర్వినియోగం జరిగినట్టు డీఎల్‌పీవో ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. నిధుల దుర్వినియోగంలో సర్పంచ్‌, కార్యదర్శులు ఇరువురికీ బాధ్యత ఉన్న నేపథ్యంలో ఇరువురిపై చర్యలు తీసుకోవాల్సిందిగా నివేదికలో తెలిపారు.

సర్పంచ్‌కు షోకాజ్‌ నోటీసు..

డీఎల్‌పీవో నివేదిక ఆధారంగా డీపీవో చర్యలకు ఉపక్రమించారు. నిధుల దుర్వినియోగంపై సర్పంచ్‌, కార్యదర్శులను 1ః1 నిష్పత్తిలో సర్పంచ్‌ కింద రూ.19.36 లక్షలు, కార్యదర్శి వాటా రూ.19.36 లక్షలకు బాధ్యులను చేస్తూ ఇకపై పంచాయతీ నిధుల విడుదలపై ఆంక్షలు విధించే అధికారం డీపీవోకు ఉన్నట్టు షోకాజు నోటీసులో పేర్కొన్నారు. పంచాయతీ కార్య దర్శిగా పనిచేసిన వి.రంగారావుపై ఉన్నతాధి కారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. అవనిగడ్డ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో జనన, మరణ నమోదుల్లో ట్యాంపరింగ్‌ చేశారనే ఫిర్యాదు ఆధారంగా పంచాయతీరాజ్‌శాఖ రాష్ట్ర కమిషనర్‌ చర్యలు తీసుకున్నారు. నిర్భంధ ఉద్యోగ విరమణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - 2023-01-25T00:27:15+05:30 IST