బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-01-25T01:12:46+05:30 IST

బాలికలకు అవకాశాలు కల్పిస్తే ఆకాశమే హద్దుగా ఎదిగి ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లో రాణిస్తారని కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అన్నారు.

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి : కలెక్టర్‌

కలెక్టరేట్‌, జనవరి 24 : బాలికలకు అవకాశాలు కల్పిస్తే ఆకాశమే హద్దుగా ఎదిగి ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లో రాణిస్తారని కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన బాలికలకు జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గుణదలలోని విజ య మేరీ అంధ విద్యార్థుల పాఠశాలలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ మెగా సిటీ సహకారంతో రూ.2.5 ల క్షల వ్యయంతో గుణదల విజయమేరీ ఇంటిగ్రేటెడ్‌ అం ధ విద్యార్థుల పాఠశాలలో ఏర్పాటు చేసిన రక్షిత మం చినీటి (ఆర్‌వో) పథకాన్ని మంగళవారం కలెక్టర్‌ దిల్లీరావు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ అంధ విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఆలోచనతో లయన్స్‌ క్లబ్‌ రక్షిత మంచినీటి (ఆరోవో ప్లాంట్‌) సౌకర్యాన్ని కల్పించడం అభినందనీయమన్నారు. లయన్స్‌ క్లబ్‌ పాస్ట్‌ డిస్టిక్ట్‌ గవర్నర్‌ డాక్ట ర్‌ పుట్టగుంట సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం కోరిన వెంటనే విద్యా, వైద్య రంగాల అ భివృద్ధికి, ప్రజలకు అవసరమైన సేవలందించేందుకు లయన్స్‌ క్లబ్‌ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా అంధ విద్యార్థినులు మానస, బింధు బ్రె యిలీ లిపిలో నీటి ప్రాముఖ్యత విశిష్టతను చదివి వినిపించిన తీరు, కుమారి అలేఖ్య సంప్రదాయ నృత్యం, విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు, నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ మెగా సిటీ ప్రతినిధులు దామెర్ల శ్రీశాంతి, లింగం శివశంకర్‌, వైపీసీ ప్రసాద్‌, మిరియాల వెంకటేశ్వరరావు, ఏ కోటిరెడ్డి, కె.శ్రీనివాసరావు, విజయ మేరీ అంధుల పాఠశాల కరస్పాండెంట్‌ డాక్టర్‌ అమల, తహసీల్దార్‌ సీహెచ్‌ దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

ఏపీ మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో...

గవర్నర్‌పేట : మహిళల రక్షణకు దేశంలో అనే క చట్టాలున్నా వారిపై అరాచకాలు తగ్గడం లేదని, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మంగళవారం చల్లపల్లి బంగ్లా సమీపంలోని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ హాలులో బాలికా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికల సంరక్షణకు సంబంధించిన ఫొటో గ్యాలరీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ శిశు సంక్షేమానికి, మహిళాభివృద్ధికి అనేక పథకాలు అమలౌతున్నా ఫలితాలు రావడం లేదన్నారు. డీఐజీ (కమ్యూనికేషన్స్‌) ఎస్‌ఎ్‌సజే లక్ష్మీ మాట్లాడుతూ అనే క కుటుంబాలు కొడుకుల మోజులో కుమార్తెలను నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. విద్యార్థినులకు నిర్వహించిన క్విజ్‌, వ్యాసరచన, పెయింటింగ్‌ పోటీల విజేతలకు అతిథులు బహుమతులు, మెమోంటోలు అందజేశారు. రెయిన్‌బో చిల్డ్రన్‌ హాస్పిటల్‌ కన్సల్టెంట్‌ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ ఉమ మిక్కిలినేని, గుణశేఖర్‌, రావి శ్రీనివాసరావు, డాక్టర్‌ పీవీ దుర్గారాణి, వెంకట్‌ పూలబాల, పెయింటర్‌ రాము, అళహరి పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T01:12:47+05:30 IST