జాతీయ కాలిగ్రఫీ పోటీలో సత్తాచాటిన ఏపీ విద్యార్థులు

ABN , First Publish Date - 2023-02-07T01:18:21+05:30 IST

జాతీయ కాలిగ్రఫీ (చేతిరాత) పోటీల్లో ఏపీ విద్యార్థులు సత్తాచాటారు.

జాతీయ కాలిగ్రఫీ పోటీలో సత్తాచాటిన ఏపీ విద్యార్థులు

కలెక్టరేట్‌/ధర్నాచౌక్‌, ఫిబ్రవరి 6 : జాతీయ కాలిగ్రఫీ (చేతిరాత) పోటీల్లో ఏపీ విద్యార్థులు సత్తాచాటారు. ఈ పోటీల్లో కలెక్టర్‌ దిల్లీరావు కుమారుడు ఎస్‌.జివితేష్‌ ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ సాధించారు. హ్యాండ్‌ రైటింగ్‌ ట్రైనర్స్‌, అమ్మఒడి హ్యాండ్‌ రైటింగ్‌ అకాడమీ ఆలిండియా గ్రాఫాలజిస్ట్‌ సంస్థ ప్రతి మూడేళ్లకు ఒకసారి ఒలింపియాడ్‌ జాతీయ కాలిగ్రఫీ పోటీలను నిర్వహిస్తోందని, హ్యాండ్‌ రైటింగ్‌ ట్రైనర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి షేక్‌ మెహబూబ్‌ హుస్సేన్‌ తెలిపారు. సుమారు 30 లక్షల మది ఆన్‌లైన్‌లో హ్యాండ్‌ రైటింగ్‌ పోటీలకు హాజరవగా గతంలో రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు కుమారుడు నలంద విద్యార్థి ఎస్‌.జివితేష్‌ జాతీయ పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనపరచి ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ను సాధించారని తెలిపారు. లాగే ఏలూరు భాష్యం స్కూల్‌కు చెందిన ఆలపాటి ప్రహర్షిక నేషనల్‌ ఎక్స్‌లెన్స్‌ హ్యాండ్‌ రైటింగ్‌ చాంపియన్‌ షిప్‌ను, ఫ్రిడ్జి ఇంటర్‌నేషనల్‌ స్కూల్‌కు చెందిన అవ్యక్త ప్రద్యుమ్మ పూజారి మిస్‌ ఇండియా బెస్ట్‌ హ్యాండ్‌ రైటింగ్‌ చాంపియన్‌ షిప్‌ను సాధించినట్టు హుస్సేన్‌ తెలిపారు. విజేతలకు జాతీయ చేతిరాత నిపుణులు భువన చంద్ర శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. జివితేష్‌, ఆలపాటీ ప్రహర్షిక, అవ్యక్త ప్రద్యుమ్మ పూజారికి కుటుంబ సభ్యులు, జిల్లా అధికారులు, విద్యాసంస్థల యాజమాన్యాలు అభినందనలు తెలిపాయి.

Updated Date - 2023-02-07T01:18:22+05:30 IST