Share News

యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ABN , First Publish Date - 2023-11-20T00:37:51+05:30 IST

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఎన్‌టిఆర్‌ జిల్లా యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏలూరు రోడ్డులోని కాంగ్రెస్‌ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
రక్తదానం చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు

యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

గవర్నర్‌పేట, నవంబరు 19: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఎన్‌టిఆర్‌ జిల్లా యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏలూరు రోడ్డులోని కాంగ్రెస్‌ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్వయంగా రక్తదానం చేశారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ, ప్రధాన కార్యదర్శి కుషిత, తమ్మిన పూర్ణిమ, పి.వై. కిరణ్‌, యువజ కాంగ్రెస్‌ అధ్యక్షుడు లక్కరాజు రామారావు బ్లడ్‌ డొనేట్‌ చేశారు. నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, యువజన కాంగ్రెస్‌ ఉపాఽధ్యక్షడు సందీప్‌, ప్రధాన కార్యదర్శి గొల్ల పవన్‌, రాంసింగ్‌, జిల్లా అధ్యక్షుడు పీటర్‌ జోసెఫ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-20T00:37:53+05:30 IST