AP Cabinet: అనకాపల్లిలో న్యూ ఎనర్జీ పార్క్‌కు గ్రీన్ సిగ్నల్

ABN , First Publish Date - 2023-02-08T13:59:03+05:30 IST

ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది.

AP Cabinet: అనకాపల్లిలో న్యూ ఎనర్జీ పార్క్‌కు గ్రీన్ సిగ్నల్

అమరావతి: ఏపీ మంత్రివర్గ (AP Cabinet Meeting) సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్కు (New Energy Park) ఏర్పాటుకు ప్రభుత్వం (AP Government) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి విడతలో రూ.55 వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు పెట్టుబడికి అంగీకారం తెలిపింది. మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడిని ప్రభుత్వం పెట్టనుంది. ఫేజ్ వన్‌లో 30 వేల మందికి, ఫేజ్‌ టూ లో 31వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. మొత్తంగా 61వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్ , సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ (Wind and Solar Power Projects)లకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 1000 మెగావాట్ల విండ్, 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌లను ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ ఏర్పాటు చేయనుంది. నాలుగు విడతల్లో మొత్తంగా రూ.10,500 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా... 2 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.

వైజాగ్ టెక్ పార్కు (Vizag Tech Park)కు 60 ఎకరాలు కేటాయించడంతో పాటు, వంద మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త పాలసీలో భాగంగా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. బందరు పోర్టు (Bandaru Port)కు పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రూ. 3940 కోట్ల రుణం తీసుకునేందుకు మంత్రివర్గం అంగీకారం తెలియజేసింది. 9.75 శాతం వడ్డీతో రూ. 3940 కోట్ల రుణం తీసుకోనుంది. అటు నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీగా పేరు మార్చేందు (Nellore Barrage to be renamed as Nallapureddy Srinivasulu Reddy Barrage)కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గ్రానైట్ కంపెనీలకు విద్యుత్ రాయితీలకు అంగీకారం తెలిపిన కేబినెట్... యూనిట్‌కు రూ. 2 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది.

వైద్యారోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌ (Recruitment in Medical Department) కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్టు (AP Medical Services Recruitment Board) ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూనివర్శిటిల్లోని నాన్ టీచింగ్ స్టాఫ్ పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. జే ఎస్ డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ (JSW Infrastructure Limited is a company)కు రామాయపట్నం పోర్టు (Ramayapatnam Port)లో రెండు క్యాప్టివ్ బెర్తులను కేటాయించనుంది. నామినేషన్ పద్దతిలో జే ఎస్ డబ్ల్యూకు బెర్తుల కేటాయింపు జరుగనుంది. జే ఎస్ డబ్ల్యూ సంస్థకు 250 ఎకరాల భూమిని మారీటైమ్ బోర్డు ద్వారా కేటాయించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొన్ని జిల్లాల కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అనంత, చిత్తూరు జిల్లా కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించాలని నిర్ణయించింది. తాడేపల్లిగూడెంలో పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.

Updated Date - 2023-02-08T14:30:10+05:30 IST