వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిదర్శనం

ABN , First Publish Date - 2023-03-18T23:23:04+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవలంభి స్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు విస్తుపోయారని ఇందుకు ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే షాజహాన బాషా పేర్కొన్నారు.

వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిదర్శనం
మదనపల్లెలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే షాజహానబాషా

మదనపల్లె టౌన, మార్చి 18: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవలంభి స్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు విస్తుపోయారని ఇందుకు ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే షాజహాన బాషా పేర్కొన్నారు. శనివారం స్థానిక దేవతానగర్‌లోని టీడీపీ పార్ల మెంట్‌ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి దొరస్వామినాయుడు ఆధ్వ ర్యంలో కృతజ్ఞత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షాజహాన బాషా మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని, పట్టభద్రులు సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు. 100 నియోజకవర్గాలో ప్రజలు వైసీపీని తిరస్కరించారన్నారు. ఇదే పరిస్థితి మదనపల్లెలో కూడా వస్తుందన్నారు. మదనపల్లెలో రెండు రోజులుగా గాలివాన బీభ త్సం సృష్టిస్తే ఇక్కడి ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు ప్రజలను పట్టించుకో లేదన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడే నాయకుడు వెళ్లి ఆదుకోవాలని సూచించారు. నారా లోకేశ యువగళం పాదయాత్రకు తండోప తండా లుగా ప్రజలు వచ్చారని, ములకలచెరువులో 20వేల మందికి పైగా ప్రజ లు పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొన్నారని ఆయన అన్నారు. దొరస్వామినాయుడు పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో లోకేశ పాదయాత్రను విజయవంతం చేసిన ప్రజలం దరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పోలీసులు వారి పద్ధతి మార్చుకోవా లని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దేవారమేశ, గుత్తి కొండ త్యాగరాజు, బాలుస్వామి, నవీనచౌదరి, నాదెళ్ల శివప్రసాద్‌, షంషీర్‌ పాల్గొన్నారు.

టీడీపీ గెలుపును తట్టుకోలేకే రాళ్లదాడులు

రాష్ట్రంలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ అభ్యర్థులు గెలుచుకోవడంతో సహించలేని కొందరు వ్యక్తులు తమ వాహనాలపై రాళ్ల దాడులు చేశారని మదనపల్లె టీడీపీ నేత జయరామనాయుడు పేర్కొన్నారు. శనివారం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడుతూ శ్రీసత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేశను మర్యాద పూర్వకంగా కలిసి వస్తుంటే మార్గమధ్యంలో ముల కలచెరువు రైల్వే గేటు వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు ద్విచక్రవాహనాలు, ఒక జీపులో తమను వెంటాడి, రాళ్లతో తమ వాహనాలపై దాడి చేశార న్నారు. కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు జేవీ రమణ, మహేశ్వర్‌రెడ్డి, మాజీ సర్పంచ చలపతినాయుడు, శ్రీనివాసరాజు, శివకుమార్‌ పాల్గొన్నారు.

ముమ్మాటికి ఇది దుశ్చర్యే..

ములకలచెరువు వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి టీడీపీ నాయకుల వాహ నాలపై రాళ్లదాడి చేయడం ముమ్మాటి దుశ్చర్యే అని హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి అంబిక లక్ష్మీనారాయణ పేర్కొ న్నారు. శనివారం ఆయన ఫోనలో మాట్లాడుతూ యువగళం పాదయా త్ర కోసం ములకలచెరువులో బస చేసిన తాను, లగేజి తెచ్చుకుందా మని ఓ ఫంక్షనహాల్‌కు వెళుతుండగా వైసీపీ శ్రేణులు యువగళం స్టిక్కర్‌ అంటించిన తన వాహనంపై రాళ్ల దాడి చేశారన్నారు.

ఎమ్మెల్సీ ఫలితాలు టీడీపీకి శుభపరిణామం

ములకలచెరువు, మార్చి 18: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయం పార్టీకి శుభపరిణామమని టీడీపీ మండల అధ్యక్షు డు పాలగిరి సిద్ధా పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై శనివారం ములకలచెరువులో సంబరాలు జరిగాయి. స్థానిక బస్టాండు సర్కిల్‌లో భారీ ఎత్తున బాణా సంచా పేల్చి ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వెంకట స్వామి, బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు చెన్నకిష్టా, బీసీ సెల్‌ రాష్ట్ర సాధికార సమితి సభ్యుడు జేసీబీ సుధాకర్‌నాయుడు, కేశవులు, నేతలు ముత్తుకూరు మౌళా, కేవీ రమణ, కాలా మహేష్‌, కట్టా హరినాధ్‌, నాయకులు మహమ్మద్‌షఫీ, రమణమూర్తి, కట్టుబడి సయ్యద్‌బాష పీటీఎం నేత సురేంద్రనాయుడు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి చెంపపెట్టు

నిమ్మనపల్లె, మార్చి 18: రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి చెంపపెట్టు లాంటిదని నిమ్మనపల్లె మండల టీడీపీ నాయకు లు పేర్కొన్నారు. శనివారం స్థానిక బస్టాండులో ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుపొందడంతో బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా మాజీ ఎంపీపీ రెడ్డెప్పరెడ్డి, బూత కన్వీనర్‌ మునిరత్నం మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు రాయలసీమ అభ్యర్థి శ్రీకాంత 40వేల మెజారిటీతో గెలవడం ఎంతో హర్షణీయమన్నారు. రాబోవు ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్నారు. కార్యక్రమం లో టీడీపీ నాయకులు వెంకటరమణ, లక్ష్మన్న, మల్లిఖార్జున, ఎల్లారెడ్డి, శంకర, రాజన్న, శ్రీపతి, మల్లయ్య, శ్రీనివాసులు, నరేంద్ర, మురళి, గోపి, విజయ్‌, అప్పోడు, చంద్ర, రామచంద్ర, నారాయణ పాల్గొన్నారు.

కలకడలో:ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధిం చడంతో కలకడలో ఆ పార్టీ నాయకులు శనివారం సంబరాలు చేసుకు న్నారు. ఇందులో భాగంగా కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. కార్య క్రమంలో నాయకులు బరకం శ్రీనివాసులరెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వ రరావు, చంద్రప్పనాయుడు, వి.వెంకటేశ్వరరావు, వెంకటసుబ్బ య్య, రాజానాయుడు, పునీతచౌదరి, నౌషాద్‌, జిలానీ పాల్గొన్నారు.

కలికిరిలో: మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ పదవులను టీడీపీ కైవసం చేసు కుందని అధికారిక ప్రకటనలు వెలువడటంతో మండలంలో పలు చోట్ల టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఐ హనీఫ్‌ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మైనా రిటీ జేఏసీ సభ్యులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి స్వగ్రామం నగరిపల్లెలో ఆయన ఇంటి ముందు ప్రదర్శన జరిపి సంబరాలు చేసుకున్నారు. మండలంలో పలు గ్రామాల్లో కూడా కార్యకర్తలు, నాయకులు కేకులు కట్‌ చేసి బాణసంచా కాల్చారు. మున్వర్‌ ఆలీ, మహ్మద్‌ ఆలీ, షబ్బీర్‌, రాజంపేట పార్లమెంటు ఉపాధ్య క్షుడు కొటాల చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో: జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ చేపట్టిన యువ గళం పాదయాత్రను తంబళ్లపల్లె నియోజకవర్గంలో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీనతాజ్‌ తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో సాగిన నారా లోకేశ యువగళం పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నందమూరి తారక రామారావు, బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు చావిడి కిట్టన్న, రవికుమార్‌, ప్రభాకర్‌, మదార్‌సాబ్‌, పద్మనాభ, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

గుర్రంకొండలో:టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచెర్ల శ్రీకాంత భారీ మెజా రిటీతో గెలవడంతో ఆ పార్టీ నాయకులు తరిగొండ, అమిలేపల్లెలో శని వారం సంబరాలు చేసుకొన్నారు. ఇందులో భాగంగా బాణసంచా పేల్చి, కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు ప్రదీప్‌ చంద్‌, చంద్రబాబు, జయప్రకాశ, హేస్సానవలి, క్రాంతికుమార్‌, రెడ్డెన్న, వేణు, వలి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:23:04+05:30 IST